మిర్చికి సీసీ కెమెరాల రక్ష 

మిర్చికి సీసీ కెమెరాల రక్ష 

పంట కల్లాలకు గతంలో రైతులే కాపలాగా ఉండేవారు. కానీ ప్రస్తుతం టెక్నాలజీ పెరగడంతో సీసీ కెమెరాలు ఏర్పాటుకు మొగ్గు చూపుతున్నారు. ఈ సీజన్‌‌‌‌‌‌‌‌లో మిర్చికి విపరీతమైన డిమాండ్‌‌‌‌‌‌‌‌ ఉండడంతో దొంగలు కల్లాల నుంచి మిర్చిని ఎత్తుకెళ్తున్నారు.

ఖమ్మం జిల్లాలోని మధిర, రఘునాథపాలెం మండలాల్లో ఇటీవల 20 క్వింటాళ్ల చొప్పున మిర్చి చోరీకి గురైంది. దీంతో రైతులు కల్లాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. మిర్చి ఎక్కువగా పండించే చర్ల మండలంలో రైతులు సీసీ కెమెరాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు.   – భద్రాచలం, వెలుగు