వర్ని,వెలుగు: భద్రాచల సీతారాముల కల్యాణానికి కోటి తలంబ్రాల దీక్ష నిజామాబాద్ జిల్లా రుద్రూర్ గ్రామంలోని విఠలేశ్వర మందిరం ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా జరిగింది. భద్రాచలం నుంచి తీసుకొచ్చిన గోటి తలంబ్రాలకు పూజలు చేసి 300మంది భక్తులు 3గంటల పాటు గోటితో వడ్లను ఒలిచి తలంబ్రాలు తీశారు.
