గన్నేరువరం పోలీసులను ఆశ్రయించిన ప్రేమ జంట

గన్నేరువరం పోలీసులను ఆశ్రయించిన ప్రేమ జంట

గన్నేరువరం, వెలుగు :  కరీంనగర్ మండలం దుర్షేడ్ గ్రామానికి చెందిన  సౌమ్య..  గన్నేరువరం మండల కేంద్రానికి చెందిన వెదిర ఆనంద్  గత కొంతకాలంగా ప్రేమించుకున్నారు. ఇద్దరి కులాలు వేరు కావడంతో పెద్దలు ఒప్పుకోరని ఆదివారం రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం జంగిరెడ్డి పల్లెలోని శ్రీ రామలింగేశ్వర ఆలయంలో పెళ్లి చేసుకున్నారు.

 అనంతరం తమ పేరెంట్స్ నుంచి ప్రాణభయం ఉందని రక్షణ కల్పించాలని గన్నేరువరం పోలీసులను ఆశ్రయించారు.  దీంతో పోలీసులు నూతన దంపతుల కుటుంబ సభ్యులను పలిపించి,  కౌన్సెలింగ్  ఇచ్చారు.