డైరెక్టర్ అజయ్ జ్ఞానముత్తు తెరకెక్కించిన సూపర్ సక్సెస్ హార్రర్ థ్రిల్లర్ 'డిమోంటి కాలనీ'. ఈ మూవీ ఇప్పటికే, రెండు భాగాలుగా వచ్చి ఆడియన్స్ ని వీపరీతంగా అలరించింది. భూతశక్తి ఆత్మలతో రూపొందిన ఈ థ్రిల్లర్, భయానక అలజడితో, ఇంట్రెస్ట్ పెంచే ట్విస్టులతో వచ్చి సూపర్ సక్సెస్ అయింది. ఇందులో తమిళ స్టార్ హీరో అరుళ్ నిధి, ప్రియాభవాని శంకర్ కీలక పాత్రలు పోషించి ఆకట్టుకున్నారు. ఈ క్రమంలోనే, న్యూ ఇయర్ స్పెషల్ గా 'డిమోంటి కాలనీ3'పై అప్డేట్ ఇచ్చారు మేకర్స్.
డైరెక్టర్ అజయ్ జ్ఞానముత్తు (2026 జనవరి 1న) సందర్భంగా 'డిమోంటి కాలనీ3' పోస్టర్ పంచుకున్నారు. ఇందులో హీరో అరుళ్ నిధి ఒక భయానక సింహాసనంపై, ఒక రాజులా తనదైన శైలిలో కూర్చొని, చేతిలో కత్తి పట్టుకుని, ఓ రకమైన నవ్వుతో కనిపిస్తూ ఉత్కంఠ పెంచారు.
అలాగే, ఆ సింహాసనం చుట్టూరా పడిఉన్న శవాలు, వెనుకాల ఆసక్తి కలిగించే విగ్రహం ఇంటెన్స్ కలిగిస్తున్నాయి. ఇలా ఒక్క ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే 'డిమోంటి కాలనీ3' పై ఆసక్తితో పాటు అంచనాలు పెంచారు డైరెక్టర్ అజయ్. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 2026 సమ్మర్ కానుకగా విడుదల కానుంది. డేట్ పై క్లారిటీ మేకర్స్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.
Presenting the FIRST LOOK of the most anticipated horror, thriller sequel #DemonteColony3 - “The End is Too Far” 😈👑
— Ajay R Gnanamuthu (@AjayGnanamuthu) January 1, 2026
Get ready for the seat-edge experience in theatres, this SUMMER 2026 💥@arulnithitamil @AjayGnanamuthu @Sudhans2017 @PassionStudios_ @DangalTV @RDCMediaPvtLtd… pic.twitter.com/brgmecYdgh
'డిమోంటి కాలనీ2' కథను గుర్తు చేసుకోండి:
సామ్యూల్ (సర్జానో ఖలీద్) క్యాన్సర్బారిన పడతాడు. కానీ అతనిలో బతకాలనే ఆశ బలంగా ఉంటుంది. తీరా జబ్బు నుంచి బయటపడ్డాక ఆత్మహత్య చేసుకుంటాడు. డెబ్బీ (ప్రియా భవాని శంకర్) అతన్ని ప్రేమిస్తుంది. సామ్యూల్ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకున్నాడనేది ఆమెకి అర్థం కాదు. దాంతో దౌషి అనే ఒక గురువు దగ్గరకు వెళ్తుంది. సామ్యూల్ ఆత్మతో మాట్లాడాలని ఉందని చెప్తుంది. ఈ విషయంలో సామ్యూల్తండ్రి ఆమెకి సహకరిస్తాడు.
రఘు (అరుళ్ నిధి), శ్రీనివాసన్ (అరుళ్ నిధి) కవల పిల్లలు. ఈ ఇద్దరూ ఆస్తిపరుడైన అమృతలింగం కొడుకులు. ఆయనకున్న 2,500 కోట్ల ఆస్తిలో 25 శాతం రఘుకి, 70 శాతం శ్రీనివాసన్కి, మిగతా ఐదు శాతం రెండో భార్య కూతురు ఐశ్వర్యకి రాస్తాడు. తక్కువ వాటా రావడంతో కోపంతో రగిలిపోతాడు రఘు. అప్పటికే ఒక ప్రమాదం వల్ల శ్రీనివాసన్ హాస్పిటల్లో ట్రీట్ మెంట్ తీసుకుంటుంటాడు. అతనికి ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టర్, డెబ్బీ తండ్రి ఒకరే.
డాక్టర్ని రఘు కలిసినప్పుడు డెబ్బీ, దౌషి అక్కడే ఉంటారు. ‘ఆస్తి నాకు మాత్రమే దక్కాలి. శ్రీనివాసన్ను చంపేయమంటాడు రఘు. లైబ్రరీలో ఉన్న ఒక పుస్తకం చదివినవాళ్లు సరిగ్గా జూన్ 6వ తేదీన అనుమానాస్పదంగా చనిపోతున్నారని తెలుస్తుంది. అప్పుడు వాళ్లేం చేస్తారు? ఆ పుస్తకం దేనికి సంబంధించింది? శ్రీనివాసన్ను రక్షిస్తారా? అనేది మిగతా కథ. ప్రస్తుతం ఈ పార్ట్ 2 జీ5లో స్ట్రీమ్ అవుతుంది
