తండ్రిని ఎదిరించి దళిత వ్యక్తిని చేసుకున్న బీజేపీ ఎమ్మెల్యే కూతురు సాక్షి మిశ్రా భర్తపై ఈ రోజు కొందరు వ్యక్తులు దాడి చేశారు. వారిద్దరు కోర్టు ప్రాంగణంలో పోలీసుల రక్షణలో ఉన్నప్పుడే ఈ దాడి జరిగింది. ఉత్తరప్రదేశ్ బరేలీ ఎమ్మెల్యే రాకేశ్ మిశ్రా కూతురు సాక్షి మిశ్రా కొన్ని రోజుల క్రితం దళిత వర్గానికి చెందిన అజితేష్ కుమార్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఆ పెళ్లి తన తండ్రికి ఇష్టం లేదని, అతని నుంచి తమకు ప్రాణ హాని కూడా ఉందని రెండు రోజుల కిందట ఓ వీడియో మెసేజ్ ని సోషల్ మీడియాలో షేర్ చేసింది.
అయితే ఆమె చెప్పినట్టుగానే.. ఈ రోజు కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఆమె భర్త అజితేష్ కుమార్ పై దాడి చేశారు. తమకు రక్షణ కల్పించాలని అలహాబాద్ కోర్టుకు చేరుకుంటుండగా కోర్టు ప్రాంగణంలోనే ఈ దాడికి పాల్పడ్డారు. ఈ విషయాన్ని వారి తరపు లాయర్ తెలిపారు.

