బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌తో పొత్తుపై హైకమాండ్‌‌‌‌‌‌‌‌దే నిర్ణయం : బీజేపీ ఎంపీ అర్వింద్

బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌తో పొత్తుపై హైకమాండ్‌‌‌‌‌‌‌‌దే నిర్ణయం : బీజేపీ ఎంపీ అర్వింద్
  • పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా స్వాగతిస్తం: బీజేపీ ఎంపీ అర్వింద్

న్యూఢిల్లీ, వెలుగు: బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌తో పొత్తుపై హై కమాండ్ నిర్ణయమే పైనల్ అని, పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా స్వాగతించాల్సిందేనని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. ప్రధాని మోదీని కేసీఆర్ కన్నా ఎక్కువగా విమర్శించిన టీడీపీ అధినేత చంద్రబాబుతోనే పొత్తు పెట్టుకున్నామని గుర్తుచేశారు. అయితే, బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌తో బీజేపీ పొత్తు ఇంఫాజిబుల్ అని, ఈ విషయంలో అధిష్టానం ఆలోచన తనకు తెలుసునని వ్యాఖ్యానించారు. కే– ఫ్యామిలీ(కేసీఆర్ ఫ్యామిలీ)తో పొత్తు ఉండదని, అయితే, ఆ పార్టీ నుంచి ఎవరైనా వస్తే బీజేపీలో చేర్చుకుంటామని చెప్పారు.

బుధవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌‌‌‌‌‌‌‌లో మీడియాతో అర్వింద్ మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి అడుగు జాడల్లో కవిత నడుస్తోందన్నారు.  ఓబీసీ రిజర్వేషన్ల అంశంలో కాంగ్రెస్ అంజెండాను తాము అమలు చేయబోమని చెప్పారు. ఈటల, బండి సంజయ్‌‌‌‌‌‌‌‌ విషయంలో సెంట్రల్ పార్టీ నోడల్ ఎంక్వైరీ కమిషన్ వేసుకోవాలని పార్టీ నేతలకు సూచించారు. రాజాసింగ్ ఎక్కడున్నా తాము గౌరవిస్తామని, ఆయన పార్టీ ఐడియాలాజికల్ పర్సన్ అని అన్నారు. ఆయన సస్పెండ్ కాలేదని, రిజైన్ చేశాడని, మిస్డ్ కాల్ ఇస్తే పార్టీ సభ్యత్వం తీసుకోవచ్చని చెప్పారు.