కర్ణాటక సీఎంగా యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం

కర్ణాటక సీఎంగా యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం

కర్ణాటకలో కొత్త ప్రభుత్వం కొలువు దీరింది. నూతన సీఎంగా బీజేపీ సీనియర్ నేత యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం చేశారు.  రాజ్ భవన్ లో గవర్నర్ వాజ్ భాయ్ వాలా, యడ్యూరప్ప చేత  ప్రమాణస్వీకారం చేయించారు. అంతకు ముందు బీజేపీ పార్టీ ఆఫీస్ నుంచి భారీ ర్యాలీతో రాజ్‌భవన్‌కు చేరుకున్న యడ్యూరప్ప … పార్టీ కార్యకర్తల ఆనందోత్సాహాల మధ్య ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ నేతలు, పలువురు ప్రభుత్వ అధికారులు హాజరయ్యారు. కర్ణాటక సీఎంగా యడ్యూరప్ప బాధ్యతలు స్వీకరించడం ఇది నాల్గవ సారి.