జూన్ 4న రైతు రుణమాఫీ చేస్తం .. రాబోయేది ఇండియా ప్రభుత్వం : రాహుల్ గాంధీ

జూన్ 4న రైతు రుణమాఫీ  చేస్తం .. రాబోయేది ఇండియా ప్రభుత్వం  :    రాహుల్ గాంధీ

 

  • అదానీ, మోదీ మీడియా ఏం రాసుకుంటారో  రాసుకోండి
  • ఎవరికి భయపడేది లేదు
  • పేద మహిళల ఖాతాల్లో ఏటా రూ. లక్ష వేస్తం
  • యూపీ ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ

ఢిల్లీ: జూన్ 4వ తేదీన పేద రైతుల రుణాలను మాఫీ చేయబోతున్నామని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ఇవాళ ఉత్తర ప్రదేశ్ లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో రాహుల్ మాట్లాడారు. కాంగ్రెస్  నేతృత్వంలోని ఇండియా కూటమి అధికారంలోకి రాబోతోందని చెప్పారు. ‘మేం అధికారంలోకి రాగానే రైతు రుణమాఫీ చేసి తీరుతామని, అదాని, మోదీ మీడియా ఏం రాసుకుంటారో రాసుకోండి.. ఎవరికీ భయపడేది లేదు..ఈ మీడియా మోదీ ఫొటోలు మాత్రమే వేస్తుంది.. ఏమైనా వేసుకోండి మేం చేయాలనుకున్నది చేస్తాం’అని వ్యాఖ్యానించారు. పేద మహిళల ఖాతాల్లో నెలకు రూ. 8,500 చొప్పున ఏడాదికి రూ. లక్ష వేయబోతున్నామని, ప్రతి పేద కుటుంబలోని ఒక మహిళ ఖాతాల్లో మహాలక్ష్మి పథకం కింద ఈ డబ్బులు వేస్తామని చెప్పారు.