అమెరికాలో ఘనంగా బొడ్డెమ్మ పున్నమి సంబురాలు

అమెరికాలో ఘనంగా బొడ్డెమ్మ పున్నమి సంబురాలు

అమెరికాలోని డాలస్ లో బతుకమ్మ, దసరా సంబురాలు నిర్వహించేందుకు తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డాలస్ ఘనంగా ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా డాలస్ లో టీపాడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన బొడ్డెమ్మ పున్నమి సంబురాలు ఉత్సాహంగా సాగాయి.  దాదాపు 200 మంది మహిళలు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.  టీపాడ్ ఆధ్వర్యంలో వచ్చే నెల 5 నుంచి ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నట్టు టీపాడ్ నిర్వాహకులు తెలిపారు.