IPL 2026: ఐపీఎల్ 2026లో భాగంగా గౌహతిలో రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరుగుతున్న హై-వోల్టేజ్ మ్యాచ్‌లో చెన్నై జట్టుకి ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. భారీ అంచనాలతో బరిలోకి దిగిన స్టార్ ఓపెనర్ సంజూ శాంసన్, కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, ఆయూష్ మాత్రే తీవ్ర నిరాశ పరిచారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సీఎస్కే టీమ్ కి ఆశించిన స్థాయిలో ఆరంభం లభించలేదు. వర్షం కారణంగా పిచ్‌పై ఉన్న తేమను రాజస్థాన్ బౌలర్లు చక్కగా ఉపయోగించుకుంటున్నారు.
మ్యాచ్ ప్రారంభమైన తర్వాత రెండో ఓవర్‌లోనే సంజూ శాంసన్ అవుట్ కావడంతో చెన్నై శిబిరంలో ఆందోళన మొదలైంది. తన పాత ఫ్రాంచైజీ (RR)పై భారీ స్కోరు సాధిస్తాడని భావించిన సీఎస్కే అభిమానులకు తీవ్ర నిరాశే ఎదురైంది. అనంతరం కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, యంగ్ ప్లేయర్ ఆయుష్ మాత్రే సైతం పెద్దగా ఆకట్టుకోలేరు. సంజూ ఔట్ అయినా 5 పరుగుల తర్వాత ఈ ఇద్దరు కూడా పెవిలియన్ కు క్యూ కట్టడంతో.. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తీవ్ర కష్టాల్లో పడింది.
జోఫ్రా అర్చర్ వేసిన మూడో ఓవర్ చివరి బంతిని ఫుల్ లెంగ్త్ తో వేయగా ఆఫ్ సైడ్‌లోని ఇన్నర్ సర్కిల్ మీదుగా కొట్టడానికి ప్రయత్నించిన గైక్వాడ్ మరీ వెనక్కి జరిగి ఫ్లిక్ చేయబోయడు.. దీంతో వికెట్ కీపర్ జూరెల్ క్యాచ్ పట్టుకోవడంతో ఔట్ అయ్యాడు. అనంతరం బ్యాటింగ్ కి వచ్చిన మరో ప్లేయర్ ఆయూష్ మాత్రే సైతం నాండ్రే బర్గర్ వేసిన 4వ ఓవర్ మొదటి బంతికే డకౌట్ అయి వెనుదిరగాల్సి వచ్చింది. అనంతరం క్రీజులోకి వచ్చిన మాథ్యూ షార్ట్ (2) సైతం పెద్దగా రాణించలేదు.. సందీప్ శర్మ బౌలింగ్ లో నిష్క్రమించగా, ఆ తర్వాత బ్యాటింగ్ కి వచ్చిన సర్ఫరాజ్ ఖాన్ కాసేపు బ్యాట్ ఝలిపించినప్పటికీ రవీంద్ర జడేజా బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూగా ఔట్ కావడంతో పెవిలియన్ కి చేరడంతో 51 పరుగులకే కీలకమైన 5 వికెట్లను కోల్పోయి సీఎస్కే కష్టాల్లో పడింది. ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన జట్టుకు ఇది ఘోరమైన ఆరంభం అని చెప్పాలి.
