హైదరాబాద్ లో తమిళనాడు మాజీ సీఎం జయలలిత ఇల్లు సీజ్

హైదరాబాద్ లో తమిళనాడు మాజీ సీఎం జయలలిత ఇల్లు సీజ్

హైదరాబాద్ లో తమిళనాడు మాజీ సీఎం, దివంగత జయలలిత ఇంటిని సీజ్ చేశారు జీహెచ్ఎంసీ అధికారులు. శ్రీనగర్ కాలనీలోని 8-3-1099/A నంబర్ గల జయలలిత ఇంటికి సంబంధించి ఆస్తి పన్ను పెండింగ్ ఉండటంతో సీజ్ చేశారు అధికారులు. 2017 నుంచి జయలలిత ఇంటి ఆస్తి పన్ను పెండింగ్ ఉండటంతో నోటీసులిచ్చిన అధికారులు.. ఆమెకు సంబంధించిన వ్యక్తుల నుంచి స్పందన రాకపోవడంతో సోమవారం ( మార్చి 30 ) ఇంటిని సీజ్ చేశారు.

ఓటీఎస్ స్కీమ్ మార్చి 31 వరకు అమలులో ఉన్న క్రమంలో  రాయితీ పోగా  రూ.82 లక్షల 91 వేల 822 మేర బకాయిలు ఉన్నట్లు తెలిపారు అధికారులు. గతంలో ఈ బిల్డింగ్ లో ప్రైవేట్ ఆఫీసులు ఉండటంతో కమర్షియల్ కాంప్లెక్స్ కింద ఆస్తి పన్ను విధించినట్లు తెలిపారు అధికారులు. 

అయితే.. 2017 నుంచి ఈ ఇంటిని నివాసానికి వాడుకుంటున్నామని.. రెసిడెన్షియల్ గా మార్చాలని జయలలిత మేనల్లుడు దీపక్ జయకుమార్ జీహెచ్ఎంసీ అధికారులను గతంలో కోరినట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉండగా.. OTS స్కీం కింద రాయితీకి మార్చి 31 తుది గడువు ఉన్న క్రమంలో ఆస్తి పన్ను బకాయిలపై వడ్డీకి 90 శాతం  మాఫీ అవకాశం కల్పించారు అధికారులు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు మూడు కార్పొరేషన్ల పరిధిలో 2,350 కోట్ల ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు చేసినట్లు తెలిపారు అధికారులు.