బోల్సనారోకి మరోసారి కరోనా పాజిటివ్‌

బోల్సనారోకి మరోసారి కరోనా పాజిటివ్‌
  • రెండు వారాల పాటు క్వారంటైన్‌లో

బ్రసిలియా: బ్రెజిల్‌ అధ్యక్షుడు బోల్సొనారో (65)కి మరోసారి కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఫాలోఅప్‌ పరీక్షల్లో భాగంగా టెస్ట్‌ చేస్తే పాజిటివ్‌ వచ్చిందని అధికారులు చెప్పారు. దీంతో ఆయన మరో రెండు వారాలపాటు క్వారంటైన్‌లోనే ఉండనున్నారు. ఈ రెండు వారాలపాటు ఆయన అధికారిక కార్యక్రమాలు, పర్యటలను అన్నీ క్యాన్సిల్‌ చేసినట్లు అధికారులు చెప్పారు. అమెరికా తర్వాత అత్యధిక కేసులు నమోదైన దేశం బ్రెజిల్‌. బోల్సోనారో మొదటి నుంచి కరోనాను లైట్‌ తీసుకున్నారు. మాస్క్‌ పెట్టుకోకుండా, సోషల్‌ డిస్టెంసింగ్‌ పాటించకుండా నిర్లక్ష్యం వహించారు. ఆయన అధికారులను కలిసినప్పుడల్లా వారికి షేక్‌హ్యాండ్‌ ఇచ్చి, కౌగిలించుకునేవారు. కాగా.. ఈ నెల 7న మొదటిసారి కరోనా పాజిటివ్‌ రావడంతో ఆయన రెండు నెలల పాటు క్వారంటైన్‌లో ఉన్నారు.