ఏపీ పోలీసులు తెలంగాణ జర్నలిస్టు కేవీఆర్‌ను ఏపీ పోలీసులు అరెస్టు చేయడాన్ని తెలంగాణ సమాఖ్య తీవ్రంగా ఖండించింది. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో తెలంగాణ సమాఖ్య ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి మాట్లాడుతూ.. కేవీఆర్ ఎలాంటి తప్పు చేయలేదని, అభిప్రాయ స్వేచ్ఛను అణచివేయడమే ఈ చర్య వెనుక ఉద్దేశమని అన్నారు.
కేవీఆర్ మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేసినందుకే తనపై కక్ష సాధించి అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపించారు. సినీ దర్శకుడు, సామాజిక కార్యకర్త సయ్యద్ రఫీ మీడియా స్వేచ్ఛకు ముప్పు ఏర్పడిందని వ్యాఖ్యానించారు. తెలంగాణ సమాఖ్య కన్వీనర్ కరుణాకర్ దేశాయి ఈ ఘటన రాష్ట్ర హక్కులకు విరుద్ధమని పేర్కొన్నారు.
►ALSO READ | హైదరాబాద్ లో మిక్చర్ కూడా తినలేము... రంగులు కలిపిన స్నాక్స్, అది నూనెనా లేక...
తెలంగాణలోకి వచ్చి ఏపీ పోలీసులు జర్నలిస్టును అరెస్టు చేయడం అప్రజాస్వామికమని, జర్నలిస్టులు ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందని వక్తలు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సీనియర్ జర్నలిస్టులు పల్లె రవికుమార్, మామిడి సోమయ్య, తెలంగాణ క్రాంతి దళ్ అధ్యక్షుడు సృధ్వీరాజ్ తదితరులు పాల్గొన్నారు.
