ఇరాన్ - అమెరికా మధ్య యుద్ధ వాతావరణం రోజురోజుకి ముదురుతోంది. లేటెస్ట్ గా సౌదీ అరేబియాలోని ఒక కీలకమైన అమెరికా వైమానిక స్థావరం (Air Base)పై ఇరాన్ క్షిపణులతో దాడి చేసింది. ఈ దాడిలో అమెరికాకు చెందిన భారీ ఇంధన విమానం KC-135 స్ట్రాటోట్యాంకర్ ధ్వంసమైనట్లు సాటిలైట్ ఫోటోల ద్వారా తెలుస్తోంది.
క్షీపణి దాడి ఎలా జరిగిందంటే
2026 మార్చి 27న రియాద్ ప్రాంతంపై ఇరాన్ ఆరు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. ఇందులో రెండు క్షిపణులను సౌదీ అరేబియా అడ్డుకోగా, మిగిలినవి ఖాళీ ప్రదేశాల్లో పడ్డాయని సౌదీ రక్షణ శాఖ చెప్పింది. సౌదీ చెబుతున్న మాటలకు భిన్నంగా, ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ లో భారీ మంటలు చెలరేగినట్లు సోషల్ మీడియాలో (X) వీడియోలు వైరల్ అయ్యాయి. అంతరిక్షం నుండి తీసిన ఫోటోలను పరిశీలిస్తే, విమానాలు ఆపే చోట పెద్ద కాలిన గుర్తు కనిపిస్తోంది. అది అమెరికాకు చెందిన భారీ ట్యాంకర్ విమానం అని నిపుణులు భావిస్తున్నారు.
నష్టం ఎంత ఉండవచ్చు
ఇంటర్నెట్‌లో ప్రచారంలో ఉన్న కొన్ని వార్తల ప్రకారం మూడు ఇంధన విమానాలు పూర్తిగా కాలిపోయాయని, మరో నాలుగు దెబ్బతిన్నాయని ఇరాన్ అనుకూల వర్గాలు చెబుతున్నాయి. అయితే దీనిపై ఇంకా అధికారిక స్పష్టత లేదు. ఈ ఒక్క నెలలోనే (మార్చి 2026) అమెరికాకు చెందిన ఐదు ట్యాంకర్ విమానాలు ఇరాన్ దాడుల్లో దెబ్బతిన్నట్లు సమాచారం. మార్చి 13న జరిగిన మరో ప్రమాదంలో ఒక విమానం కూలిపోగా, ఇంకొకటి గాలిలో ఢీకొనడం వల్ల దెబ్బతింది.
►ALSO READ | అణ్వాయుధాల తయారీపై ఇరాన్ ప్రతినిధి ప్రకటన.. యుద్ధాన్ని భారత్ ఆపగలదంటూ కామెంట్స్
ఈ విమానం ప్రత్యేకత ఏంటి
KC-135 స్ట్రాటోట్యాంకర్ అనేది ఆకాశంలో ఎగురుతున్నప్పుడే ఇతర యుద్ధ విమానాలకు ఇంధనం నింపే ఒక పెద్ద విమానం. ఇది దెబ్బతినడం అంటే అమెరికా యుద్ధ సామర్థ్యంపై దెబ్బ పడినట్లే. ఈ ఒక్కో విమానం ధర సుమారు $79 మిలియన్లు అంటే మన భారతీయ కరెన్సీలో దాదాపు రూ.749 కోట్లకు పైగా ఉంటుంది. మొత్తం మూడు విమానాల విలువ రూ.2,247 కోట్లు.
An Iranian ballistic missile scored a direct hit on Prince Sultan Air Base (PSAB) in Saudi Arabia 🇸🇦🇺🇸.
— Egypt's Intel Observer (@EGYOSINT) March 6, 2026
PSAB is a key U.S. Air Force hub, hosting E-3 Sentry AWACS, E-11A BACNs, tankers, and fighter aircraft. pic.twitter.com/cRzGP4rXXn
