పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న క్రమంలో ఇరాన్ మరోసారి గల్ఫ్ దేశాలకు వార్నింగ్ఇచ్చింది.. మీ భూభాగాలనుంచి మాపైదాడికి అనుమతిస్తే తీవ్రంగా నష్టపోతారని హెచ్చరించింది. అమెరికా సైనికబలగాలు గల్ఫ్ దేశాల్లో మోహరించాయి. మా పై దాడులు చేస్తున్నాయి. ఇది రిపీట్అయితే మీ భద్రత, అభివృద్ధికి తీవ్ర ముప్పు తప్పదని గల్ఫ్ దేశాలను హెచ్చరిస్తూ ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ సోషల్ మీడియా ద్వారా శనివారం గల్ఫ్ దేశాలను హెచ్చరించారు.
గల్ఫ్ దేశాలనుద్దేశించి ఇరాన్ అధ్యక్షుడు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ‘‘ఇరాన్ ఎప్పుడూ ముందస్తు దాడులు చేయదు.. ఇది ఇంతకుముందుకూడా చెప్పాం.. అయితే మా మౌళిక సదుపాయాలు, ఆర్థిక కేంద్రాలు లక్ష్యంగా దాడి చేస్తే గట్టిగా ప్రతీకారం తీర్చుకుంటామని‘‘ మసూద్ పెజెష్కియాన్ Xలో పోస్ట్ చేశారు. మీకు అభివృద్ది, భద్రత కావాలంటే మీరు మా శత్రువులకు మీ భూభాగాలనుంచి అనుమతి ఇవ్వొద్దంటూ హెచ్చరించారు.
సౌదీలోని అమెరికా రహస్య స్థావరాలపై ఇరాన్ దాడి
ఇదిలా ఉంటే.. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న క్రమంలో దుబాయ్ లోని రెండు అమెరికా సైనిక స్థావరాలపై దాడి చేసినట్లు ఇరాన్ ప్రకటించిందని ఆదేశ మీడియా తెలిపింది. గతంలో ఇరాన్ జరిపిన దాడుల తర్వాత అమెరికా సైన్యం ఈ ప్రాంతాలకు తరలివెళ్లిందని తెలిపింది. ఆ ప్రదేశంలో దాదాపు 500 మందికి పైగాఅ మెరికా సైన్యం ఉందని 400 మంది ఒకచోట, 100 మంది సైనికులు మరోచోట ఉన్నట్లు గుర్తించామని, ఖచ్చితమైన క్షిపణి, డ్రోన్ దాడులు జరిపామని ఇరాన్ తెలిపింది. అమెరికన్ సైనికులకుఆ ప్రాంతం స్మశానంగా మారిందని, చివరికి అమెరికా నాయకత్వం వెనక్కి తగ్గడం తప్పా మరో మార్గం ఉండదని ఇరాన్ అధికార వర్గాలు తెలిపాయి.
►ALSO READ | మోదీ- ట్రంప్ ఫోన్ కాల్‌లో ఎలాన్ మస్క్..! పుకార్లను కొట్టిపారేసిన కేంద్రం
మిడిల్ ఈస్ట్ లో అమెరికా సైన్యం..
మరోవైపు పెంటగాన్ 82వ ఎయిర్ బోర్న్ డివిజన్ కు చెందిన దళాలు పశ్చిమాసియాకు పంపనుందని సీబీసీ నివేదిక తెలిపింది. ఈ సైన్యంలో అమెరికా కమాండ్విభాగం, భూతల దళాలు ఉండొచ్చని తెలిపింది. ఇరాన్ ఆ ద్వీపానికి మందుపాతరలు అమర్చడం, అదనపు బలగాలను తరలించడం ప్రారంభించినట్లు వార్తలు వస్తున్నప్పటికీ, ఖార్గ్ ద్వీపంలో అమెరికా భూతల సైనిక చర్య చేపట్టే అవకాశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు ఆ నివేదిక పేర్కొంది.
