మధ్యప్రదేశ్లో నర్సింగ్విద్యార్థిని దారుణ హత్య..హారర్వీడియో వైరల్

మధ్యప్రదేశ్లో నర్సింగ్విద్యార్థిని దారుణ హత్య..హారర్వీడియో వైరల్

మధ్యప్రదేశ్​ లో నర్సింగ్​ విద్యార్థిని దారుణ హత్యకు గురైంది. ఆస్పత్రిలో వృత్తి శిక్షణ పొందుతున్న ట్రైనీ నర్సుపై పట్టపగలే దాడి జరిగింది. అక్కడున్న వారంతా ప్రేక్షకులు చూశారు తప్పా ఒక్కరూ స్పందించలేదు. నిందితుడు ఆత్మహత్యకు ప్రయత్నించాడు కానీ విఫలమై అక్కడినుంచి పారిపోయాడు. ఈ హృదయ విదారక ఘటనకు సంబంధించిన వీడియో సోషల్​ మీడియాలో వైరల్​అవుతోంది.    

మధ్యప్రదేశ్‌లోని నర్సింగ్‌పూర్ జిల్లా ఆస్పత్రిలో18 ఏళ్ల నర్సింగ్ విద్యార్థిని దారుణంగా హత్య చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ హృదయ విదారక దృశ్యాలను గుర్తుతెలియని వ్యక్తి మొబైల్ ఫోన్‌లో బంధించి సోషల్​ మీడియా పెట్టడంతో వైరల్ అవుతోంది. 

18యేళ్ల నర్సింగ్​చదువుతున్న సంధ్యాచౌదరి అనే యువతిని ఆస్పత్రిలో వృత్తి క్లాసులకు హాజరవుతుండగా ఆమె ప్రియుడిగా చెబుతున్న అభిషేక్​ కోష్టి ఆమెపై దాడి చేశాడు. వీడియోలో కోష్టి విద్యార్థి గొంతు కోస్తున్నదృశ్యాలు కనిపిస్తున్నాయి. వందలాది మంది అక్కడ ఉన్నా చూస్తుండి పోయారు తప్ప ఒక్కరూ కూడా స్పందించలేదు. 

యువతి గొంతు కోసిన తర్వాత నిందితుడు తాను గొంతుకోసుకొని ఆత్మహత్యాయత్నం చేశారు. కానీ విఫలమయ్యాడు. వెంటనే అక్కడినుంచి పారిపోయాడు. ఈ ఘటన ఆస్పత్రిలోనే జరగడం కలకలం రేపుతోంది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు యువతి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..నిందితుడు ,యువతి రెండేళ్లుగా ప్రేమలో ఉన్నారు. అయితే ఇటీవల వారిద్దరి మధ్య గొడవలు రావడంతో అమ్మాయిపై కత్తితో దాడి చేశాడు. ఫలితంగా ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. అని నర్సింగ్‌పూర్ ఎస్పీ మృగాఖి డేకా తెలిపారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. సోషల్​ మీడియాలో వైరల్ అయిన వీడియో క్లిప్​..ఈ హత్య కేసులో కీలకంగా మారాయి. దర్యాప్తు కొనసాగుతోంది.