కాసేపట్లో పెళ్లనగా.. ఇష్టం లేదని తెగించిన యువతి ఏం చేసిందంటే..

కాసేపట్లో పెళ్లనగా.. ఇష్టం లేదని తెగించిన యువతి ఏం చేసిందంటే..
పెండ్లి ఇష్టం లేదని 100 కు డయల్ బలవంతంగా మ్యారేజ్ చేస్తున్నారని చెప్పిన వధువు లాస్ట్ మినిట్ లో ఆగిన పెళ్లి నర్సింహులపేట (మరిపెడ), వెలుగు: తనకు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని పెళ్లి కూతురు 100 నంబరుకు డయల్ చేయడంతో పోలీసులు పెండ్లిని ఆపేశారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలో జరిగింది. కురవి మండలం కాంపెల్లి గ్రామానికి చెందిన యువతికి మరిపెడ మండలం గుండెపుడి గ్రామానికి చెందిన యువకుడితో గురువారం ఉదయం 11:55 గంటలకు వివాహం నిశ్చయించారు. పెండ్లి తంతు జరుగుతుండగా పెళ్లి కూతురు లేచి తాను ఒక  యువకుడిని ప్రేమించానని, తల్లిదండ్రులకు చెప్పినా వినకుండా తనకు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని బంధువులతో చెప్పింది. అదే సమయంలో 100కు డయల్ చేసింది. దీంతో పోలీసులు వచ్చి పెండ్లి ఆపేశారు. వధువును పోలీస్ స్టేషన్​కు తరలించి కౌన్సెలింగ్ ఇచ్చారు. For More News.. హైదరాబాద్‌కు ఆదాయం లేదు.. అప్పులపైనే ఆశలు ఇప్పటికీ పెండింగ్ మ్యుటేషన్లు లక్షా 20 వేలు అగ్రిగోల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కేసులో రూ.4,109 కోట్ల ఆస్తులు సీజ్