యూపీలో రేపిస్టులదే రాజ్యం

యూపీలో రేపిస్టులదే రాజ్యం

మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై.. యూపీ సర్కార్ కఠిన నిర్ణయాలు తీసుకోవాలన్నారు బీఎస్పీ చీఫ్ మాయావతి. బలరాంపూర్ లో ఎక్కువగా దళిత స్టూడెంట్లపై దాడులు పెరుగుతున్నాయన్నారు. యూపీలోని బీజేపీ పాలనలో క్రిమినల్స్, మాఫియాలు, రేపిస్టులదే రాజ్యంగా మారిందన్నారు. మహిళలకు భద్రత కల్పించలేనపుడు యోగి ఆదిత్యనాథ్.. సీఎం పదవికి రాజీనామాం చేయాలన్నారు. యోగిన గోరఖ్ పూర్ మఠానికి పంపాలని కేంద్రాన్ని కోరుతున్నానని చెప్పారు యోగి.

హత్రాస్ ఘటనపై ఏర్పాటు చేసిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ దర్యాప్తు కొనసాగుతోందన్నారు ఎస్పీ విక్రాంత్ వీర్. సిట్ సభ్యులు బాధితురాలి కుటుంబ సభ్యులతోనూ మాట్లాడారని చెప్పారు. క్రైమ్ స్పాట్ ను పరిశీలించారని చెప్పారు. ప్రస్తుతం సిట్ సభ్యులు గ్రామంలోనే ఉన్నారని.. ఇన్వెస్టిగేషన్ కొనసాగుతోందని చెప్పారు ఎస్పీ. హత్రాస్ ఘటనను సుమోటోగా స్వీకరించింది జాతీయ మానవ హక్కుల సంఘం. వివరణ కోరుతూ ఉత్తరప్రదేశ్ సర్కారుకు, రాష్ట్ర డీజీపీకి నోటీసులు జారీచేసింది.