ఆన్లైన్ గేమింగ్ ఎంతపని చేసింది: రూ35 లక్షల గోల్డ్ చోరీచేసిన టెన్త్ క్లాస్ స్టూడెంట్స్

ఆన్లైన్ గేమింగ్ ఎంతపని చేసింది: రూ35 లక్షల గోల్డ్ చోరీచేసిన టెన్త్ క్లాస్ స్టూడెంట్స్

ఆన్లైన్ గేమింగ్ ఎంత పని చేసింది. 10 వ తరగతి విద్యార్థులు ఆన్లైన్లో గేమింగ్ కు బానిసై..వారు ఏం చేస్తున్నారో కూడా తెలియని స్థితికి దిగజారి పోయారు..స్నే హితులతో కలిసి ఏకంగా సొంత ఇంట్లోనే దొంగతనం చేశాడు ఓ విద్యార్థి. వందలు..వేలు కాదు..రూ. 35 లక్షల విలువైన బంగారు ఆభరణాలను చోరీ చేసి అమ్మేశారు. వచ్చిన డబ్బులో ఆన్లైన్ గేమింగ్, జల్సాలు చేశారు. విషయం తెలియని ఆ విద్యార్థి తండ్రి పోలీసులకు కంప్లైంట్ చేయడంతో అసలు విషయం బయటికి వచ్చిం ది. 

కర్ణాటకలో ని ఆర్ ఆర్ నగర్ కు చెందని ఇద్దరు టెన్త్ క్లాస్ విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. రూ. 35 లక్షల విలువై బంగారం, వజ్రాభరణాలు దొంగిలించిన కేసు లో వీరిని అరెస్ట్ చేశారు. 

తన ఇంట్లో బంగారం, ఇతర ఆభరణాలు కనిపించడం లేదని విద్యార్థి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టగా మరో విద్యార్థితో కలిసి ఆభరణాలు దొంగిలించినట్లు విచారణలో తేలింది.   

కెంగేరిలో బంగారం దుకాణం నడుపుతున్న వారి దగ్గర పనిచేసే వారి సాయంతో ఆభరణాలను విక్రయించారు.  చోరీకి గురైన 400 గ్రాముల బంగారన్ని విక్రయించగా వాటిలో రూ.23 లక్షల విలువైన 300 గ్రాముల బంగారన్ని రీకవరి చేశారు.డైమండ్ నెక్లెస్ ను ఇంకా స్వాధీనం చేసుకోలేదని పోలీసులు చెపుతున్నారు. 

తల్లిదండ్రులు వారి పిల్లలు ఏం చేస్తున్నారు..సెల్ ఫోన్లు వాడుతున్నప్పుడు ఓ కంట కనిపెట్టాలని పోలీసులు సూచిస్తున్నారు. ఆన్ లైన్ గేమ్ లకు అలవాటు పడని వ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అంటున్నారు. ఇలాంటి వాటి ప్రభావం పిల్లలపై ఎక్కువగా ఉండి తీవ్ర నష్టానికి దారి తీస్తాయని హెచ్చరిస్తున్నారు.