టపాకాయలా ఏంటీ : గేమ్స్ ఆడుతుంటే.. మొబైల్ పేలిపోయింది

టపాకాయలా ఏంటీ : గేమ్స్ ఆడుతుంటే.. మొబైల్ పేలిపోయింది

ఇన్ని రోజులు బాంబులు చూడాలంటే ఇండియా- పాకిస్తాన్ బార్డర్ కో లేకా ఎక్కడైనా యుద్ధం జరిగితేనో చూసేవాళ్లం కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇంట్లో ఓ బాంబు ఉందని తెలుస్తుందా.. మీరు ఎప్పుడైనా గమనించారా.. మా ఇంట్లో మాకు తెలియకుండా బాంబా.. అని ఆశ్చర్యపోతున్నారు కదా.. అవును నిజమే ఆ బాంబు మరెక్కడో లేదు మీ చేతిలోనే ఉంది.. అదే మీ సెల్ ఫోన్.. సెల్ ఫోన్ బాంబు ఎంట్రా బాబు.. అని అనుకుంటున్నారు కదా.. అయితే పూర్తిగా చదవండి..

మద్యప్రదేశ్ లోని మైహార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖైరా గ్రామంలో బుధవారం ఓ ఇంట్లో మొబైల్ ఫోన్ పేలడంతో ఇద్దరు చిన్నారులు గాయపడ్డారు. గాయపడిన కృష్ణ సాహు, శుభం సాహులను జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఫోన్‌లో గేమ్‌ ఆడుతుండగా మొబైల్ ఒక్కసారిగా పేలిపోయింది, కుటుంబ సభ్యుల ఇంటి పినిలో నిమగ్నమై ఉన్న సమయంలో ఈ ఘటన జరిగింది. 

పిల్లలు ఫోన్ ఛార్జర్‌ను పవర్ బోర్డుకు కనెక్ట్ చేయడంతో, అది పేలింది మరియు పిల్లలిద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. పేలుడు శబ్దం విన్న కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్లి పిల్లలను జిల్లా ఆసుపత్రికి తరలించారు. కృష్ణ ఒక బొటనవేలు కోల్పోయాడు, శుభం ముఖం, చేతికి గాయాలయ్యాయి. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు సదరు నెటిజన్స్.. ఇంకేముంది క్షణాల్లోనే వైరల్ గా మారింది. ప్రతి ఇంట్లో ఓ బాంబు ఉందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.