తెలంగాణ మున్సిపల్ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న క్రమంలో రాష్ట్రంలో రాజకీయం వేడెక్కింది. ఎన్నికల ప్రచారానికి సోమవారం ( ఫిబ్రవరి 9 ) సాయంత్రంతో శుభం కార్డు పడుతుండటంతో కీలక ప్రెస్ మీట్ నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్. బీఆర్ఎస్ పార్టీని యాసిడ్ పోసి కాడగాలని.. రాష్ట్రంలో దరిద్రాన్ని కారణమే బీఆర్ఎస్ అని అన్నారు. బీఆర్ఎస్ కు ఓటు అడిగే అర్హత లేదని అన్నారు సీఎం రేవంత్
తాము అధికారంలోకి రాగానే మొదటి తారీఖున జీతాలిచ్చామని..బీఆర్ఎస్ పాలనలో ఏనాడు ఒకటో తారీఖున జీతాలివ్వలేదని అన్నారు. పదేళ్లు అధికారంలో ఉన్నది బీఆర్ఎస్ కాదా..? మున్సిపాలిటీల్లో సమస్యలకు కారణం బీఆర్ఎస్ కాదా అని ప్రశ్నించారు సీఎం రేవంత్. పదేళ్ల అవినీతి పాలనతోనే మున్సిపాలిటీల్లో సమస్యలు వచ్చాయని.. రూ. 20 కోట్ల నిధులిస్తే పేదలకు ఏం చేశారని ప్రశ్నించారు. వరదలొచ్చి పట్టణాలు కొట్టుకపోతే.. బీఆర్ఎస్ నాయకులు కనీసం పరామర్శించారా అని ప్రశ్నించారు సీఎం రేవంత్.
►ALSO READ | తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం బంద్
కేసీఆర్ గెలిచి ప్రతిపక్ష నాయకుడయ్యాడని.. ఏనాడైనా అసెంబ్లీకి వచ్చాడా..? ప్రతిపక్ష నేతగా ఎన్నికై 24 నెలలు అవుతుందని.. ఒక్కరోజైనా సభకు వచ్చాడా అని ప్రశ్నించారు సీఎం రేవంత్. మున్సిపాలిటీల్లో ఒకడో, ఇద్దరో బీఆర్ఎస్ వాళ్ళు గెలిస్తే పని చేస్తారా అని అన్నారు.
బీఆర్ఎస్ పదేళ్లలో అవినీతి చేయని రంగం ఎదో చెప్పాలని అన్నారు. భార్యాభర్తలు ఫోన్ మాట్లాడుకుంటే దొంగచాటుగా విన్నారని.. వ్యాపారస్తులను బెదిరించి వందల ఎకరాలు రాయించుకున్నారని అన్నారు సీఎం రేవంత్.
