క్లాస్ రూమ్ లో అందరూ చూస్తుండగానే.. అమ్మాయిని గన్ తో కాల్చి చంపి.. తర్వాత..

క్లాస్ రూమ్ లో అందరూ చూస్తుండగానే.. అమ్మాయిని గన్ తో కాల్చి చంపి.. తర్వాత..

పంజాబ్ లో దారుణం జరిగింది. ఓ కాలేజీలో క్లాస్ రూమ్ లో అందరు చూస్తుండగానే అమ్మాయిని గన్ తో కాల్చి చంపేసి.. తర్వాత తనను తానే షూట్ చేసుకున్నాడు ఓ స్టూడెంట్. సోమవారం ( ఫిబ్రవరి 9 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి... పంజాబ్ లోని తర్న్ తరన్ జిల్లాలో జరిగింది ఈ దారుణం. జిల్లాలోని ఉస్మాలో ఉన్న మై భాగో లా కాలేజీలో ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ తన తోటి స్టూడెంట్ ని కాల్చి చంపి, ఆ తర్వాత అదే గన్ తో తనను తాను కాల్చుకొని చనిపోయాడు.

మల్లియన్ గ్రామానికి చెందిన ప్రిన్స్ రాజ్ అనే స్టూడెంట్ నౌషెహ్రా పన్నువాన్‌కు చెందిన సందీప్ కౌర్ అనే అమ్మాయిని గన్ తో కాల్చి చంపేశాడు. ఇవాళ ఉదయం 9:16 గంటల ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో సందీప్ కౌర్ అక్కడికక్కడే మరణించగా, ప్రిన్స్ రాజ్ కూడా చనిపోయినట్లుతెలిపారు పోలీసులు. ప్రిన్స్ కౌర్‌ను ఎందుకు చంపాడనేది ఇంకా తెలియలేదు, అయితే దర్యాప్తు జరుగుతోంది. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పోలీసులు. ఘటనాస్థలంలో గన్, బుల్లెట్ షెల్స్, ఇతర ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఫోరెన్సిక్ టీం కూడా ఆధారాలు సేకరిస్తోంది. ఈ క్రమంలో కాలేజీని సీజ్ చేశారు పోలీసులు. ఈ ఘటన కారణంగా కాలేజీలో ఉద్రిక్తత నెలకొంది. 

తమ పిల్లలకు కాలేజీలో భద్రత లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తల్లిదండ్రులు. ఒక స్టూడెంట్ గన్ తీసుకొని లోపలి వస్తోంటే కనీసం తనిఖీ కూడా చేయరా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనపై విచారణ జరిపి కాలేజీ మేనేజ్మెంట్ పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు పేరెంట్స్.