
ఈ నగరానికి ఏమైంది ఫేమ్ అభినవ్ గోమటం (Abhinav Gomatam) హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ మై డియర్ దొంగ (My Dear Donga). సర్వజ్ఞ కుమార్ డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీ ఆహా ఓటీటీలో రిలీజ్ అయ్యి ప్రేక్షకాదరణ పొందుతుంది. ఏప్రిల్ 19న స్ట్రీమింగ్ కి వచ్చిన ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ మై డియర్ దొంగలో అభినవ్ గోమటంకి జోడీగా శాలిని కొండెపూడి (Shalini Kondepudi) హీరోయిన్గా నటించింది.
అయితే ఈ మూవీ థియేటర్లను స్కిప్ చేస్తూ..డైరెక్ట్ గా ఆహా ఓటీటీలో రిలీజై తెలుగు ప్రేక్షకుల్ని మెప్పిస్తోంది.ప్రస్తుతం ఈ సినిమా విడుదలై వారం దాటినా కూడా ఆహా ఓటీటీలో టాప్ 5 ట్రెండింగ్ మూవీస్‌లో ఒకటిగా మై డియర్ దొంగ నిలిచింది. ఈ సందర్భంగా (మే1న) బుధవారం మై డియర్ దొంగ సక్సెస్ మీట్‌ను ఏర్పాటుచేసింది చిత్రబృందం.
ఈ సక్సెస్ మీట్ లో హీరోయిన్ కమ్ రైటర్ శాలిని కొండేపూడి మాట్లాడుతూ.."మై డియర్ దొంగ మూవీకి వస్తోన్న రివ్యూస్,రెస్పాన్స్ చాలా ఆనందాన్ని కలిగిస్తోన్నాయి. ఇంత గొప్ప రెస్పాన్స్ వస్తోందని అసలు ఊహించలేదు.మంచి కంటెంట్ నమ్మి హానెస్ట్గా సినిమా చేస్తే సక్సెస్ తప్పకుండా వస్తుందని అనడానికి మై డియర్ దొంగ ఎగ్జాంపుల్‌గా నిలిచింది. నేను రాసిన ఈ స్టోరిని డైరెక్టర్ గొప్పగా అర్ధం చేసుకొని మరింత గొప్పగా స్క్రీన్‌పై ప్రజెంట్ చేశాడు. ఏదేమైనా అందరికీ రికమెండ్ చేసే మంచి చిత్రమిది. యూత్ నుంచి ఫ్యామిలీస్ వరకు ప్రతి ఒక్కరూ ఈ మూవీకి కనెక్ట్ అవుతూ ఎంజాయ్ చేస్తున్నారని" శాలిని తెలిపింది.
హీరో అభినవ్ గోమటం మాట్లాడుతూ..‘‘చిన్న సినిమాకు మన తెలుగు ప్రేక్షకులు పెద్ద విజయాన్ని అందించారు. కెరీర్ ఫస్ట్ మూవీతోనే రైటర్‌గా తనను తాను శాలిని ప్రూవ్ చేసుకున్నది. టాలీవుడ్ లో నెం 1 ప్రొడ్యూసర్ అయిన అల్లు అరవింద్‌కు మా సినిమా నచ్చడం ఆనందంగా ఉంది అభినవ్ తెలిపాడు.
అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ ప్రజెంటర్‌గా వ్యవహరిస్తోన్న ఈ సినిమాను మహేశ్వర్ రెడ్డి నిర్మించాడు.అజయ్ అరసాడా మ్యూజిక్ అందించాడు.
అభినవ్ గోమటం సినిమాలు చూసుకుంటే..
2014లో వచ్చిన మైనే ప్యార్ కియా మూవీతో ఎంట్రీ ఇచ్చిన..2018లో వచ్చిన ఈ నగరానికి ఏమైంది చిత్రంలోని కౌశిక్ పాత్ర ద్వారా గుర్తింపు పొందాడు.అలాగే తన కామెడీ టైమింగ్‌తో ఆడియన్స్ ను ఆకట్టుకున్నాడు. సినిమా ఆద్యంతం హిలేరియస్‌గా అతడి క్యారెక్టర్ నవ్వించింది. అలాగే ఈ మధ్య కాలంలో అభినవ్ సినిమాలు చూసుకుంటే..మీకు మాత్రమే చెప్తా,శ్యామ్ సింగరాయ్‌తో,విరూపాక్షతో పాటు పలు సినిమాలు చేశాడు.ఇక రీసెంట్గా ఓటీటీలో వచ్చిన సేవ్ ది టైగర్స్ సిరీస్‌తో ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చి అదరగొట్టాడు.
The critics have spoken and they are spellbound by the entertainment! ❤️?
— ahavideoin (@ahavideoIN) April 30, 2024
Watch #MyDearDongaOnAha streaming now! ▶️https://t.co/rRYqxjU8xg #AnAhaOriginalFilm @ahavideoIN #camentertainment @AbhinavGomatam #shalinikondepudi #divyasripada #nikhilgajula @Sprite pic.twitter.com/O3xbT5IXVd