మోదీ రేపిస్ట్‌కు మద్దతు ఇచ్చారు : రాహుల్ గాంధీ

మోదీ రేపిస్ట్‌కు మద్దతు ఇచ్చారు : రాహుల్ గాంధీ

బీజేపీ నేతలపై విమర్శలు చేశారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. ప్రజ్వల్ రేవ‌ణ్ణ ఓ సామూహిక రేపిస్టు అన్న విష‌యం బీజేపీ నాయకులకు తెలుసని ఆరోపించారు. అయినా జేడీఎస్‌తో కూట‌మి ఏర్పాటు చేశార‌ని అన్నారు. క‌ర్ణాట‌క‌లోని  శివ‌మొగ్గలో జ‌రిగిన ఎన్నిక‌ల ప్రచార స‌భ‌లో ఇవాళ రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 

ఎంపీ ప్రజ్వల్ రేవ‌ణ్ణ  చేసింది సెక్స్ స్కాం కాదుని,  ఓ సామూహిక రేపిస్టు అని ఆరోపించారు. ప్రజ్వల్ రేవ‌ణ్ణ 400 మంది మ‌హిళ‌ల్ని రేప్ చేశాడ‌ని, వాటి వీడియోలు తీశార‌ని విమర్శించారు. ఆ మాస్ రేపిస్టుకు ప్రధాని మోదీ మ‌ద్దతు ఇచ్చార‌ని రాహుల్ గాంధీ ఆరోపించారు.