బీఎస్పీ బిడ్డల మీద చెయ్యి వేస్తే.. కోనప్ప ఇంటి ముందుంటం

బీఎస్పీ బిడ్డల మీద చెయ్యి వేస్తే.. కోనప్ప ఇంటి ముందుంటం

ఏడేళ్ల తర్వాత కేసీఆర్ కు దళితులు గుర్తొచ్చారన్నారు BSP రాష్ట్ర కో-ఆర్డినేటర్ RS ప్రవీణ్ కుమార్. హుజురాబాద్ లో ఎలాగైనా గెలవాలని విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు చేస్తున్నారన్నారు. ఆదిలాబాద్ లోని కుమ్మరి, మేదరివాడల్లో పర్యటించారు ప్రవీణ్. వివిధ పార్టీల నేతలు, కార్యకర్తలు బీఎస్పీలో చేరారు. 2014 లో ఏనుగు గుర్తు మీద గెలిచిన ఎమ్మెల్యే కోనేరు కొనప్ప.. BSPలో చేరాలనుకునే వాళ్లను బెదిరిస్తున్నారన్నారు. బీఎస్పీ బిడ్డల మీద చెయ్యి వేస్తే... రాష్ట్రంలోని బహూజనులంతా కోనప్ప ఇంటి ముందుంటారని హెచ్చరించారు. మంత్రి మల్లారెడ్డి600 ఎకరాల అంశంపైనా పూర్తిస్థాయి విచారణ జరిపించాలన్నారు ప్రవీణ్.