కేరళ సీఎం పినరయి విజయన్ పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఏప్రిల్ 7న కేరళలో ఎన్నికల ప్రచారంలో భాగంగా కోవలం, మావేలికర నియోజకవర్గాల్లో రోడ్ షో నిర్వహించారు సీఎం.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విజయన్, మోదీ అడుగు జాడల్లో నడుస్తున్నారని విమర్శించారు. విజయన్ ను అక్రమాస్తుల నుంచి మోదీ కాపాడుతున్నారని ఆరోపించారు. అందుకే ఆయనపై ఎన్ని ఆరోపణలు వచ్చినా దర్యాప్తు సంస్థలు చర్యలు తీసుకోవడం లేదన్నారు. పినరయి విజయన్ కు మోదీ గాడ్ ఫాదర్ అని.. ఆయను రోల్ మోడల్ గా భావిస్తున్నారని విమర్శించారు.
ఎవరెన్ని కుట్రలు చేసిన కేరళలో ఎగిరేది కాంగ్రెస్ జెండానేని అన్నారు. తెలంగాణ అభివృద్ధిపై విజయన్ తో ఎపుడంటే అపుడు చర్చకు సిద్ధమని సవాల్ చేశారు రేవంత్ . ఏప్రిల్ 9న కేరళ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఫలితాలు మే 4న వెలువడతాయి.
