కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతం ఒకటో తేదీన వేయాల్సిందే : సీఎం రేవంత్ రెడ్డి

కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు  జీతం ఒకటో తేదీన వేయాల్సిందే : సీఎం రేవంత్ రెడ్డి
  • ఏజెన్సీల ఇష్టారాజ్యానికి చెక్.. జీతాలు లేటైతే కఠిన చర్యలు: సీఎం రేవంత్ ​రెడ్డి
  •     ఉద్యోగుల ఖాతాల వివరాలు సేకరించి డిజిటలైజ్ చేయాలని ఆదేశం
  •     హెల్త్ కార్డులు, ఇతర బెనిఫిట్స్ సమర్థంగా అమలుకు అవసరం
  •     క్షేత్రస్థాయి స్టడీకి కమిటీ.. వంద రోజుల్లో సమస్యల పరిష్కారం
  •     అవసరమైతే కొత్త చట్టాలు రూపొందిస్తామని వెల్లడి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని కాంట్రాక్టు, ఔట్‌‌‌‌‌‌‌‌సోర్సింగ్‌‌‌‌‌‌‌‌ ఉద్యోగులందరికీ ప్రతి నెల ఒకటో తేదీనే జీతాలు అందాల్సిందేనని సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌రెడ్డి స్పష్టం చేశారు. వివిధ విభాగాల్లో పనిచేస్తున్న ఈ ఉద్యోగుల వివరాలు, వారి బ్యాంక్ అకౌంట్లను సేకరించి వివరాలన్నింటినీ పూర్తిగా డిజిటలైజ్ చేయాలని ఆదేశించారు. ప్రభుత్వం సకాలంలో నిధులు విడుదల చేస్తున్నా.. ఉద్యోగులకు జీతాలు చెల్లించకుండా వేధిస్తున్న ఏజెన్సీలపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ వ్యవహారంలో క్షేత్రస్థాయి అధ్యయనానికి ఉన్నతాధికారులతో ఒక కమిటీని ఏర్పాటు చేయాలని, వంద రోజుల్లోనే ఈ ప్రక్రియ మొత్తాన్ని కొలిక్కి తీసుకురావాలని సీఎం దిశానిర్దేశం చేశారు. 

మంగళవారం ఎంసీఆర్‌‌‌‌‌‌‌‌ హెచ్‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌డీలోని బోధి పెవి లియన్‌‌‌‌‌‌‌‌లో కాంట్రాక్టు, ఔట్‌‌‌‌‌‌‌‌సోర్సింగ్‌‌‌‌‌‌‌‌ ఉద్యోగుల సమస్యలపై సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌రెడ్డి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. పరిపాలనలో మరింత పారదర్శకతను పెంచేందుకు డిజిటల్‌‌‌‌‌‌‌‌ గవర్నెన్స్‌‌‌‌‌‌‌‌ దిశగా వేగంగా అడుగులు వేయాలని అధికారులకు సూచించారు. ఇందుకు సంబంధించిన సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేయడంతో పాటు అవసరమైన చట్టాలను కూడా రూపొందించాలని ఆదేశించారు. డిజిటల్ గవర్నెన్స్‌‌‌‌‌‌‌‌ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందడమే కాకుండా, ప్రభుత్వ సంక్షేమ పథకాలు నేరుగా లబ్ధిదారులకు చేరుతాయని సీఎం అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా కాంట్రాక్టు, ఔట్‌‌‌‌‌‌‌‌సోర్సింగ్‌‌‌‌‌‌‌‌ సిబ్బందికి కూడా ఒకటో తారీఖున జీతాలు అందించేందుకు వీలుగా వివరాల డిజిటలైజేషన్ ప్రక్రియను తక్షణమే చేపట్టాలన్నారు.

పారదర్శకంగా జీతాల చెల్లింపు

ప్రభుత్వం నుంచి ఏజెన్సీలకు సకాలంలోనే చెల్లింపులు జరుగుతున్నప్పటికీ, అవి ఉద్యోగులకు సమయానికి జీతాలు ఇవ్వడం లేదన్న అంశంపై సీఎం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయంలో ప్రభుత్వం చాలా సీరియస్‌‌‌‌‌‌‌‌గా ఉందని, నిర్లక్ష్యం వహించే ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. డిజిటల్ గవర్నెన్స్ ద్వారా ఈ సమస్యకు శాశ్వతంగా చెక్ పెట్టవచ్చని సీఎం సూచించారు. కొత్త విధానంతో కాంట్రాక్టు, ఔట్‌‌‌‌‌‌‌‌సోర్సింగ్ ఉద్యోగులకు ప్రతి నెల 1 నుంచి 5వ తేదీలోగా అత్యంత పారదర్శకంగా జీతాల చెల్లింపులు జరుగుతాయని వివరించారు.

ప్రత్యేక నిఘా వ్యవస్థ ఏర్పాటు

ఈ సమస్యపై సమగ్రంగా క్షేత్రస్థాయి అధ్యయనం చేసేందుకు వివిధ విభాగాల అధికారులతో ఒక కమిటీని ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. ఈ కమిటీ వంద రోజుల్లోగా పూర్తిస్థాయి అధ్యయనాన్ని ముగించి, ప్రక్రియను కొలిక్కి తీసుకురావాలని స్పష్టం చేశారు. అలాగే, హెల్త్‌‌‌‌‌‌‌‌ కార్డులు, ఇతర ప్రభుత్వ ప్రయోజనాలు సమర్థవంతంగా అమలు చేసేందుకు వీలుగా రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగుల వివరాలను కూడా పూర్తిగా డిజిటలైజ్ చేయాలని సూచించారు. ఈ మొత్తం వ్యవహారాన్ని నిరంతరం పర్యవేక్షించేందుకు (మానిటరింగ్‌‌‌‌‌‌‌‌) ఆర్థిక శాఖ ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలన్నారు.