నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని ఉత్తరవాహిని గోదావరి సమీపాన పంట పొలాల్లో మంగళవారం అరుదైన శ్వేత నాగు(తెల్లటి నాగుపాము) కనిపించింది. పట్టణంలోని శ్రీరాంనగర్ కాలనీకి చెందిన ఆసూరి సంతోష్ కుమార్ తన స్నేహితుడు రవితో కలిసి పంట పొలాలను పరిశీలించి తిరిగి వస్తుండగా, రోడ్డుకు ఆనుకుని ఉన్న ఓ పొలంలో తెలుపు రంగులో ఉన్న సుమారు ఏడు అడుగుల నాగుపాము కనిపించింది. ఆ పామును చూసిన స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు.
ఖానాపూర్, వెలుగు
