ధోనీకి ఫిఫా బర్త్ డే విషెస్ .. నంబర్ 7 తో అదిరిపోయే పోస్ట్

ధోనీకి ఫిఫా బర్త్ డే విషెస్ .. నంబర్ 7 తో అదిరిపోయే పోస్ట్

న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మంగళవారం తన 45వ పుట్టినరోజును ఘనంగా జరుపుకున్నారు.ఈ సందర్భంగా  ‘ఫిఫా’ నుంచి అందిన  బర్త్‌‌డే విషెస్  అందరికి ఆశ్చర్యాన్ని  కలిగించింది. ప్రస్తుతం జరుగుతున్న టోర్నమెంట్‌‌లో 7 గోల్స్ చేసిన ఫుట్‌‌బాల్ సూపర్ స్టార్స్  మెస్సీ,  ఎంబాపె, ఎర్లింగ్ హాలాండ్‌‌ల ఫొటోలతో , ధోనీ జెర్సీ నంబర్​ జోడించి "7 గోల్స్. థాలా ఫర్ ఎ రీజన్.. హ్యాపీ థాలా డే" అంటూ  ఫిఫా షేర్​చేసింది. మరోవైపు ధోనీ పుట్టినరోజుపై బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా స్పందిస్తూ.. భారత క్రికెట్‌‌లో ధోనీ ఒక నిజమైన ఐకాన్ అని, ఆయన నాయకత్వ వారసత్వం లక్షలాది మందికి నిరంతరం స్ఫూర్తినిస్తుందని కొనియాడారు.

మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్ 2013 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన జ్ఞాపకాలను పంచుకుంటూ.. ఒత్తిడిలోనూ ధోనీ ప్రదర్శించే ప్రశాంతత ఎందరికో ఆదర్శమని పేర్కొన్నారు. ధోనీ ఐపీఎల్ ఫ్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్ కే)  వీడియోను విడుదల చేస్తూ.. ధోనీ అనే హీరో తమకు ఒక జీవన విధానంగా మారాడని ప్రకటించింది. ఐసీసీ నిర్వహించే మూడు ప్రధాన వైట్-బాల్ ట్రోఫీలను (2007 టీ20 వరల్డ్ కప్, 2011 వన్డే వరల్డ్ కప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీ) గెలుచుకున్న ఏకైక భారతీయ కెప్టెన్‌‌గా ధోనీ చరిత్ర సృష్టించారు.