రాష్ట్రంలోని ‘స్టైపెండ్‌‌ కావాలంటే... అటెండెన్స్ పంపండి’

రాష్ట్రంలోని ‘స్టైపెండ్‌‌ కావాలంటే... అటెండెన్స్ పంపండి’

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, టీచింగ్  హాస్పిటల్స్‌‌లో పనిచేస్తున్న సీనియర్ రెసిడెంట్లు, జూనియర్ రెసిడెంట్లు, ఇంటర్న్‌‌లకు స్టైపెండ్‌‌ల చెల్లింపు ప్రక్రియను క్రమబద్ధీకరించేలా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రిన్సిపాల్స్, హాస్పిటల్ సూపరింటెండెంట్లకు మంగళవారం సర్క్యులర్ పంపింది. 

ప్రస్తుత జులై నెల -స్టైపెండ్‌‌ల కోసం ఈ నెల1వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఉన్న అటెండెన్స్ వివరాలను అందజేయాలని సూచించింది. అంతేకాకుండా, ఇకపై ముందటి నెల 21వ తేదీ నుంచి ప్రస్తుత నెల 20వ తేదీ వరకు ఉన్న హాజరు వివరాలను నివేదించాలని స్పష్టం చేసింది.