ట్యాంక్ బండ్ పై నుంచి నిమజ్జనం చేసి తీరుతం : భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి

ట్యాంక్ బండ్ పై నుంచి నిమజ్జనం చేసి తీరుతం : భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి
  • గణేశుని మండపాలన్నీ మందిరాలవుతయ్
  •      ట్యాంక్​బండ్​పై ఆందోళన
  •     గ్రిల్స్​ తొలగించే యత్నం 
  •     అరెస్ట్​ చేసిన పోలీసులు 

ముషీరాబాద్, వెలుగు: ప్రశాంత వాతావరణంలో జరుగుతున్న గణేశ్​ఉత్సవాలకు ఆంక్షలు పెడితే ఊరుకునే ప్రసక్తే లేదని భాగ్యనగర్ గణేశ్​ఉత్సవ సమితి హెచ్చరించింది. ట్యాంక్ బండ్ వద్ద నిమజ్జనానికి ఏర్పాట్లు చేయకపోతే వినాయకుని మండపాలన్నీ మందిరాలవుతాయని హెచ్చరించారు. సోమవారం సమితి ప్రతినిధులు ట్యాంక్ బండ్ పై నిరసన తెలిపారు.

ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేసి హుస్సేన్ సాగర్ రెయిలింగ్​కు ఏర్పాటు చేసిన గ్రిల్స్ ను తొలగించే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు వారిని అరెస్ట్​చేసి, గాంధీనగర్ ఠాణాకు తరలించారు. ఈ సందర్భంగా ఉత్సవ సమితి ప్రతినిధులు శశిధర్, ఆలె భాస్కర్, శివాజీ, వినయ్, వైకుంఠం, మహేందర్, శక్తిసింగ్ మాట్లాడుతూ.. ప్రతీ సంవత్సరం చేస్తున్నట్లుగానే ఈసారీ ట్యాంక్ బండ్​వద్ద గణేశ్​నిమజ్జనానికి ఏర్పాట్లు చేయాల్సింది పోయి హుస్సేన్ సాగర్ చుట్టూ కంచె పెట్టి అడ్డుకోవడం ఏంటని  ప్రశ్నించారు.