న్యూజెర్సీలో ఘనంగా ప్రధాని మోడీ బర్త్ డే వేడుకలు

న్యూజెర్సీలో ఘనంగా ప్రధాని మోడీ బర్త్ డే వేడుకలు

న్యూజెర్సీ: అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రం ఎడిసన్ నగరంలో ఓవర్సీస్ బీజేపీ ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోదీ 76వ బర్త్​డే వేడుకలతోపాటు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. భారతీయ సంస్కృతి, జాతీయ ఐక్యత, దేశాభివృద్ధి అంశాలను ప్రస్తావిస్తూ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. దేశాభివృద్ధి, ప్రపంచ వేదికపై భారతదేశ ప్రతిష్ట, ప్రవాస భారతీయులతో భారతదేశానికి ఉన్న అనుబంధంపై వక్తలు మాట్లాడారు. 

తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ చరిత్ర, నిజాం పాలన నుంచి విముక్తి కోసం సాగిన పోరాటం, ప్రజల త్యాగాలను స్మరించుకున్నారు. తెలంగాణ చరిత్రను భావితరాలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని కార్యక్రమంలో పాల్గొన్న వక్తలు పేర్కొన్నారు. కార్యక్రమంలో కృష్ణా రెడ్డి అనుగుల, విలాస్ రెడ్డి జంబుల, అమర్ గోస్వామి, అనిత చద్దా, అమిత్ పాండ్యే, గుంజన్ మిశ్రా, సుమిత్ పాండ్యే, నిత దోషీ, స్మిత దోషీ తదితరులు పాల్గొన్నారు.