ఆదిలాబాద్ రిమ్స్‎లో అగ్ని ప్రమాదం.. చిన్నారి మృతి

ఆదిలాబాద్ రిమ్స్‎లో అగ్ని ప్రమాదం.. చిన్నారి మృతి

ఆదిలాబాద్‌‌, వెలుగు: ఆదిలాబాద్‌‌ రిమ్స్‌‌లో సోమవారం అర్ధరాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. పిల్లల వార్డులో షార్ట్‌‌సర్క్యూట్‌‌ కారణంగా ఏసీ పేలడంతో మంటలు చెలరేగి ఓ చిన్నారి మృతి చెందింది. వార్డులో దట్టంగా పొగ కమ్ముకుని పిల్లలు అస్వస్థతకు గురవ్వగా వెంటనే  వారిని మరో ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రిమ్స్‌‌కు చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.