ఆర్థిక సమస్యలతో రిటైర్డ్ టీచర్ చచ్చిపోయిండు.. బావమరుదులే కారణమని 33 పేజీల నోట్

ఆర్థిక సమస్యలతో రిటైర్డ్ టీచర్ చచ్చిపోయిండు.. బావమరుదులే కారణమని 33 పేజీల నోట్

జనగామ అర్బన్, వెలుగు: ఇచ్చిన డబ్బులు తిరిగి రాకపోవడంతో పాటు తెచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వలేక అప్పుల ఊబిలో చిక్కుకొని ఓ రిటైర్డ్  టీచర్​ సూసైడ్​ చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జనగామ జిల్లా కేంద్రంలోని పూర్ణిమ కాలనీలో రిటైర్డ్  టీచర్​ పగిడిపాటి మల్లయ్య(63) ఉంటున్నాడు. అతని బావమరుదులు రత్నాకర్, మనోహర్​ కోట్ల రూపాయలు లాక్కొని చేతులెత్తేయడంతో మానసికంగా కుంగిపోయాడు.

ఈ క్రమంలో అప్పు చేసి కూతురి వివాహం చేశాడు. బిడ్డ పెళ్లికి అప్పులు ఇచ్చిన వారి వేధింపులు తట్టుకోలేక, ఇచ్చిన డబ్బులు తిరిగి రాకపోవడంతో 33 పేజీల సూసైడ్  నోట్  రాసి ఇంటి మెయిన్​ డోర్ కు ఉరేసుకున్నాడు. మృతుడికి భార్య అనిత, కొడుకు భార్గవ, కూతురు మౌక్తిక ఉన్నారు. ఘటనా స్థలాన్ని జనగామ సీఐ సత్యనారాయణ రెడ్డి పరిశీలించి, డెడ్​బాడీని పోస్టుమార్టం కోసం హాస్పిటల్ కు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.