శబరి ఎక్స్‌‌‌‌ప్రెస్‌‌‌‌లో జంట ఆత్మహత్యాయత్నం

శబరి ఎక్స్‌‌‌‌ప్రెస్‌‌‌‌లో జంట ఆత్మహత్యాయత్నం
  •     వివాహేతర సంబంధమే కారణం 
  •     కోయంబత్తూర్ నుంచి సికింద్రాబాద్ వస్తుండగా ఘటన 

సికింద్రాబాద్, వెలుగు:  చెన్నై,- సికింద్రాబాద్ మధ్య నడిచే శబరి ఎక్స్‌‌‌‌ప్రెస్‌‌‌‌లో మంగళవారం మధ్యాహ్నం తీవ్ర కలకలం రేగింది. వివాహేతర సంబంధం కారణంగా ఓ జంట రైలులోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. రైల్వే పోలీసుల ప్రకారం.. శ్రీకాకుళం జిల్లా మేలియాపుట్టి మండలం చాపర గ్రామానికి చెందిన శ్రీరామ్ శిరీష్ కుమార్ (34)కు వివాహమై, ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే, అదే గ్రామానికి చెందిన గులివేందుల నీలవేణి (34) అనే వివాహితతో అతడికి గత రెండు నెలలుగా వివాహేతర సంబంధం ఉంది. నెల రోజుల క్రితం వీరిద్దరూ ఊరు విడిచి తమిళనాడులోని కోయంబత్తూరుకు పారిపోయారు. విషయం తెలుసుకున్న శిరీష్ కుమార్ భార్య సులోచన కోయంబత్తూరుకు వెళ్లి వారిద్దరిని పట్టుకుంది. అనంతరం ఇద్దరూ తిరిగి హైదరాబాద్ వచ్చేలా ఒప్పించింది. 

భార్య కన్నుగప్పి పురుగుల మందు తాగిన జంట

ఈ క్రమంలో ముగ్గురూ కలిసి కోయంబత్తూరులో శబరి ఎక్స్‌‌‌‌ప్రెస్ (ట్రైన్ నంబర్ 20630) జనరల్ బోగీ ఎక్కారు. మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో రైలు సికింద్రాబాద్ స్టేషన్‌‌‌‌కు చేరుకుంటున్న సమయంలో, సులోచన కన్నుగప్పి శిరీష్ కుమార్, నీలవేణి ఇద్దరూ వెంట తెచ్చుకున్న పురుగుల మందును తాగారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు.