మనవడికి గాయం.. ఏఐజీ ఆస్పత్రికి కేసీఆర్

మనవడికి గాయం.. ఏఐజీ ఆస్పత్రికి కేసీఆర్
  • గేమ్స్ ఆడుతుండగా హిమాన్షుకు ప్రమాదం 

గచ్చిబౌలి, వెలుగు: మాజీ సీఎం కేసీఆర్ మనవడు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కుమారుడు కల్వకుంట్ల హిమాన్షుకు స్వల్ప గాయమైంది. సోమవారం సాయంత్రం గేమ్స్ ఆడుతుండగా హిమాన్షు ముక్కుకు దెబ్బతగిలింది. దీంతో కుటుంబ సభ్యులు ఆయన్ను వెంటనే గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన విషయం తెలిసిన వెంటనే మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు ఆస్పత్రికి చేరుకుని హిమాన్షును పరామర్శించారు. అలాగే, మంగళవారం సాయంత్రం సిద్దిపేటలోని ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి కేసీఆర్ నేరుగా ఏఐజీ ఆస్పత్రికి వచ్చారు. 

మనవడి ఆరోగ్య పరిస్థితి గురించి అక్కడి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. తన కుమారుడి ఆరోగ్యంపై కేటీఆర్ ‘ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’లో పోస్ట్ పెట్టారు. సోమవారం సాయంత్రం గేమ్స్ ఆడుతుండగా హిమాన్షుకు చిన్న గాయమైందని, ప్రస్తుతం చికిత్సను అందిస్తున్నారని పేర్కొన్నారు. హిమాన్షు ఆరోగ్యంపై ఆరా తీస్తూ ఫోన్లు, మెసేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.