హైదరాబాద్, వెలుగు: దోస్త్ ద్వారా సీట్లు పొందిన విద్యార్థులు తాము చేరిన కాలేజీలోనే కోర్సు మార్చుకునేందుకు ఇంట్రా కాలేజీ ఫేజ్ అడ్మిషన్ల షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 10 నుంచి 13 వరకు విద్యార్థులు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాలని టీజీసీహెచ్‌ఈ చైర్మన్ బాలకిష్టారెడ్డి తెలిపారు. ఈ నెల 14న సీట్ల కేటాయింపు ఉంటుందని చెప్పారు.
విద్యార్థులు కోరుకున్న కోర్సులో సీట్లు ఖాళీగా ఉంటేనే, మెరిట్, రిజర్వేషన్ల ఆధారంగా సీట్లు కేటాయిస్తారు. ఒకవేళ ఇంట్రా కాలేజీ ఫేజ్‌లో కొత్త కోర్సు రాకపోతే, ప్రస్తుతం ఉన్న పాత సీటు అలాగే కొనసాగుతుందని అధికారులు తెలిపారు.
