- వివరాలు వెల్లడించిన మంత్రి తుమ్మల
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం రైతుభరోసా పథకం కింద 7 నుంచి 8 ఎకరాల సాగు భూమి కలిగిన 58,831 మంది రైతుల ఖాతాల్లో రూ.259.73 కోట్లను నేరుగా జమ చేసింది. ఈ విడతలో 4.32 లక్షల ఎకరాలకు సంబంధించిన రైతుభరోసా సాయం అందినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
కేవలం ఏడు రోజుల్లోనే రైతుభరోసా కింద రూ.7,750.45 కోట్లను విడుదల చేసినట్లు తెలిపారు. ఇప్పటివరకు 68.96 లక్షల మంది రైతులకు కోటీ 29 లక్షల 17 వేల ఎకరాల సాగుభూమికి పెట్టుబడి సాయం అందించినట్లు వివరించారు. అర్హులైన ప్రతి రైతుకు రైతుభరోసా అందిస్తామని మంత్రి స్పష్టం చేశారు.
