రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఉమ్మడి మెట్రో! : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

రాష్ట్ర ప్రయోజనాల కోసమే  ఉమ్మడి మెట్రో! :  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
  •     నేరుగా అప్పు తీసుకుంటే 10 నుంచి 12 శాతం వడ్డీ
  •     కేంద్రాన్ని కలుపుకుంటే 2 నుంచి 4 శాతంలోపే
  •     మీడియాతో చిట్​చాట్‌‌‌‌లో  కేంద్రమంత్రి కిషన్‌‌‌‌ రెడ్డి

న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ ప్రయోజనాలు, ప్రజలకు ప్రయాణ భారం మరింత పెరగొద్దనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా మెట్రో ప్రాజక్ట్‌‌‌‌లపై ముందుకెళ్లాలని ఆలోచన చేసినట్టు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు కేంద్ర మంత్రులు, సీఎం మధ్య ఇటీవల జరిగిన చర్చల్లో నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. మెట్రో ఫేజ్1, ఫేజ్2కు రాష్ట్ర ప్రభుత్వమే సొం తగా అప్పులు తీసుకుంటే 10 నుంచి 12 శాతం వడ్డీలు కట్టాల్సి వస్తుందన్నారు. అదే కేంద్రాన్ని కలుపుకొని ముందుకెళ్తే... కేవలం 2 నుంచి 4 శాతం వడ్డీలకే రుణాలు తీసుకోవచ్చన్నారు. దాదాపు 8% వడ్డీ భారాన్ని తగ్గించుకోవచ్చన్నారు. మంగళవారం తాడిచర్ల2 బ్లాక్ కేటాయింపుపై సమావేశం తర్వాత.. కాసేపు మీడియా ప్రతినిధులతో చిట్​చాట్​చేశారు.

జాయింట్ వెంచర్‌‌‌‌‌‌‌‌గా వెళ్తే బాగుంటుంది

మెట్రో ఫేజ్1, ఫేజ్2 ప్రాజెక్ట్​ల కోసం రాష్ట్ర ప్రభుత్వం దాదాపు రూ.54వేల కోట్లు రుణం తీసుకోవాల్సి వస్తుందని కిషన్‌‌‌‌ రెడ్డి అన్నా రు. ‘కేంద్ర ప్రభుత్వం సహకారంతో ముందు కెళ్తే ఈ లోన్లకు ఎఫ్‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌బీఎం సమస్య ఉండదు. ముఖ్యంగా వడ్డీ కూడా 2 నుంచి 4 శాతం మిం చదు. అందుకే  కేంద్రంతో కలిసి జాయింట్ వెంచర్‌‌‌‌‌‌‌‌గా చేపడితే బాగుంటుంది. ఇటీవల కేంద్ర మంత్రులుగా తాను, అశ్వినీ వైష్ణవ్, సీఎం రేవంత్ రెడ్డి మధ్య జరిగిన మీటింగ్‌‌‌‌లో మెట్రో ఫేజ్1 మనుగడ, అభివృద్ధి, మెట్రో ఫేజ్2పై చర్చించాం. అయితే, ఈ వ్యవహారంపై నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ అని వైష్ణవ్ స్పష్టం చేశారు. 

అందుకే ఖట్టర్‌‌‌‌‌‌‌‌తో భేటీ అయ్యాం. అందులో కన్సల్టెంట్ వేయాలని నిర్ణయానికి వచ్చారు. ఈ కారణంగానే మెట్రో విస్తరణ ఆలస్యం కానుంది. అయితే, ఇందులో రాజకీయం లేదు. అలాగే, మేడిగడ్డ కుంగిపోవ డంపై రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ ఎంక్వైరీ కోరింది. ప్రస్తుతం ఈ అంశం కోర్టు పరిధిలో ఉన్నందు న.. జోక్యం చేసుకోలేం. వర్షాకాల సమావేశాల తర్వాత కేంద్ర మంత్రివర్గ విస్తరణ ఉంటుందని టీవీల్లో చూస్తున్నానని, అంతకు మించి నాకు కూడా ఏమీ తెలియదు’ అని అన్నారు.