పవన్ వీరాభిమాని నిరంజన్ మృతి.. జూన్ 17న జనసేనాని పరామర్శ.. ఇంతలోనే విషాదం

పవన్ వీరాభిమాని నిరంజన్ మృతి.. జూన్ 17న జనసేనాని పరామర్శ.. ఇంతలోనే విషాదం

హైదరాబాద్: హనుమకొండ హనుమాన్ నగర్కు చెందిన బాలుడు, పవన్ కళ్యాణ్ అభిమాని నిరంజన్ మృతి చెందాడు. హైదరాబాద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. అనారోగ్యం కారణంగా నిరంజన్ పరిస్థితి విషమించడంతో చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు అతనిని హైదరాబాద్కు తరలించారు.

చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతి చెందాడు. జూన్ 17న నిరంజన్ను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పరామర్శించిన సంగతి తెలిసిందే. పవన్ అభిమాని మృతి చెందడంతో జనసేన నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నిరంజన్ మృతి పట్ల స్థానికులు, ప్రజాప్రతినిధులు సంతాపం వ్యక్తం చేస్తూ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

మంచానికే పరిమితమైన తన అభిమాని నిరంజన్ను కలిసేందుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌‌‌‌‌‌‌‌ కల్యాణ్‌‌‌‌‌‌‌ జూన్ 17న‌ హనుమకొండకు వెళ్లిన సంగతి తెలిసిందే. వరంగల్‍ కేయూ సమీపంలోని హనుమాన్‍నగర్‍ (పెగడపల్లి డబ్బాల్‍)కు చెందిన పొనుగోటి రాంగోపాల్‍, మాసన దంపతుల కొడుకు నిరంజన్‌‌‌‌‌‌‌‌ ‘డ్యూచెన్‌‌‌‌‌‌‌‌ మస్య్కులర్‌‌‌‌‌‌‌‌ డిస్ట్రోఫి’తో బాధ పడుతున్నాడు. మంచానికే పరిమితం అయిన నిరంజన్‌‌‌‌‌‌‌‌ పవన్‌‌‌‌‌‌‌‌కల్యాణ్‌‌‌‌‌‌‌‌కు ఫ్యాన్‌‌‌‌‌‌‌‌కు మారి, ఏదో ఒకరోజు తన అభిమాన హీరోను కలవాలన్న ఆశతో ఉన్నాడు. ఈ విషయం తెలుసుకున్న పవన్‌‌‌‌‌‌‌‌కల్యాణ్‌‌‌‌‌‌‌‌ బుధవారం హనుమకొండ వెళ్లి నిరంజన్‌‌‌‌‌‌‌‌ను కలిశారు.

నిరంజన్‌‌‌‌‌‌‌‌ ఇంటికి వెళ్లిన పవన్‌‌‌‌‌‌‌‌కల్యాణ్‌‌‌‌‌‌‌‌ తిరుమల వేంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదాన్ని అందజేసి, శాలువా కప్పి అక్షింతలు వేసి, నిరంజన్‌‌‌‌‌‌‌‌కు హత్తుకున్నారు. ఈ సందర్భంగా పవన్‌‌‌‌‌‌‌‌ కల్యాణ్‌‌‌‌‌‌‌‌ నటన, డైలాగ్‌‌‌‌‌‌‌‌లను అనుకరిస్తూ నిరంజన్‌‌‌‌‌‌‌‌ చేసిన వీడియోలను చూసి ఆనందించారు. అనంతరం జనసేనకు సంబంధించిన డైరీలో ‘ప్రియమైన నిరంజన్‍కు ప్రేమతో.. ఆ దుర్గామాత ఆశీస్సులతో నువ్వు చల్లగా ఉండాలని కోరుకుంటూ.. పవన్‌‌‌‌‌‌‌‌ కల్యాణ్‍’ అని రాసి సంతకం చేసిచ్చారు.