V6 News

మహీంద్రా ఆఫర్: వాహనం కొని.. మూడ్నెల్ల తర్వాత EMI

మహీంద్రా ఆఫర్: వాహనం కొని.. మూడ్నెల్ల తర్వాత EMI

కరోనా వ్యాప్తి కారణంగా తగ్గిన అమ్మకాలను పెంచుకునేందుకు మహీంద్రా సంస్థ వినూత్నమైన ఆఫర్ ప్రకటించింది. వాహనాలు ఇప్పుడు కొంటే..మూడునెలల తర్వాత EMI లు కట్టుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపింది. కొనుగోలుదారులు తమకు ఇష్టమైన మహీంద్రా వాహనాన్ని ఇప్పటికిప్పుడే సొంతం చేసుకోవచ్చని తెలిపింది. కొనుగోలు సమయంలో EMI చెల్లించాల్సిన అవసరం లేదని..మూడు నెలల తర్వాతనే మొదటి EMI చెల్లించవచ్చంటూ ఆఫర్ ను ఇచ్చింది. 

అంతేకాదు.. ఓన్ లైన్  ప్లాట్ ఫామ్ ద్వారా రుణ సదుపాయం, క్యాష్ బ్యాక్ ఆఫర్లు, రూ.3 వేల విలువైన యాక్సెసరీస్, లోన్ సమయంలో రూ.2 వేల విలువైన బెనిఫిట్స్... ఇలా అనేక ఆఫర్లు ప్రకటించింది మహీంద్రా సంస్థ. వాహనానికి సంబంధించిన వారెంటీ పొడిగింపు, యాక్సెసరీస్ ఖర్చు, వర్క్ షాపు చార్జీలు వంటి ఇతర చెల్లింపులను కూడా వాయిదాల పద్ధతిలో చెల్లించేందుకు అవకాశం కల్పించింది.