నేను బతికున్నంత వరకు CAA అమలు కానివ్వ

నేను బతికున్నంత వరకు CAA అమలు కానివ్వ

తాను బతికున్నంత వరకు రాష్ట్రంలో సిటిజన్ షిప్ అమెండ్ మెంట్ యాక్ట్(సీఏఏ) అమలు చేయనివ్వనన్నారు పశ్చిమబెంగాళ్ సీఎం మమతా బెనర్జీ. దేశ ప్రజల హక్కులను ఎవరూ కాలరాయలేరన్నారు. ఒక్కరూ కూడా బెంగాల్  గానీ దేశం  గానీ విడిచి వెళ్ళాల్సిన అవసరం లేదన్నారు. బెంగాల్ లో ఎలాంటి నిర్భంద కేంద్రాలుండవన్నారు.18 ఏళ్లు నిండిన యువకులు ప్రభుత్వాన్ని ఎన్నుకోవచ్చుగానీ..నిరసన తెలిపే హక్కు లేదా అని ప్రశ్నించారు. సీఏఏకు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్న విద్యార్థులకు తాను మద్దతిస్తున్నట్లు ప్రకటించారు.సీఏఏకు వ్యతిరేకంగా ఉద్యమం కొనసాగుతుందని..తప్పకుండా విజయం సాధిస్తామన్నారు.