V6 News

ఏ గ్రౌండ్‌‌లోనైనా సిక్స్‌‌లు కొడతా

ఏ గ్రౌండ్‌‌లోనైనా సిక్స్‌‌లు కొడతా

తిరువనంతపురం : ఏ మైదానంలోనైనా అలవోకగా సిక్సర్లు కొట్టే సత్తా తనకు ఉందని టీమిండియా యంగ్ క్రికెటర్‌‌‌‌ శివమ్ దూబే తెలిపాడు. రెండో టీ20లో రోహిత్‌‌ సలహాతోనే  ధాటిగా ఆడగలిగానని చెప్పాడు. ‘గ్రీన్​ ఫీల్డ్​ గ్రౌండ్ చాలా పెద్దది. కానీ నేను ఏ మైదానంలోనైనా సిక్స్‌‌లు కొట్టగలను. మూడో స్థానంలో బ్యాటింగ్‌‌కు దిగడం నాకొచ్చిన గొప్ప అవకాశం. ఈ మ్యాచ్ ప్రారంభంలో  కొంత ఒత్తిడికి లోనయ్యాను. కానీ ఆ సమయంలో ప్రశాంతంగా ఉంటూ నీ బలాన్ని నమ్ముకో అని రోహిత్ బాయ్ ఇచ్చిన సలహా బాగా ఉపయోగపడింది. నాకు కూడా సీనియర్ల నుంచి ఇలాంటి మోటివేషన్‌‌ కావాలనిపించింది. ఒక్క సిక్స్‌‌ కొట్టిన తర్వాత పరిస్థితులు నాకు అనుకూలంగా మారాయి. దురదృష్టవశాత్తు మేం కొన్ని క్యాచ్‌‌లు వదిలేశాం. అవి మా గెలుపు అవకాశాలను దెబ్బతీశాయి. కానీ ప్రతీ జట్టు క్యాచ్‌‌లు జారవిడుస్తోంది. ఇది అంత పెద్దవిషయం కాదు. ఈ మ్యాచ్​ మాకు కఠినంగా సాగింది. తర్వాతి మ్యాచ్‌‌ వరకు పుంజుకుంటాం’ అని దూబే తెలిపాడు. పొలార్డ్‌‌ వేసిన ఓ ఓవర్‌‌లో మూడు సిక్సర్లు కొట్టడం దూబే పవర్‌‌ హిట్టింగ్‌‌కు నిదర్శనం.