అమీర్‌‌‌‌‌‌‌‌ పేట్ ఎల్లారెడ్డి గూడలోని అద్దెదారులపై దాడి.. బొంతు శ్రీదేవిపై కేసు

అమీర్‌‌‌‌‌‌‌‌ పేట్ ఎల్లారెడ్డి గూడలోని అద్దెదారులపై దాడి.. బొంతు శ్రీదేవిపై కేసు

పంజాగుట్ట, వెలుగు: నగర మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ భార్య, చర్లపల్లి మాజీ కార్పొరేటర్ బొంతు శ్రీదేవిపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌‌‌‌‌‌‌‌లో కేసు నమోదైంది. అమీర్‌‌‌‌‌‌‌‌పేట్ ఎల్లారెడ్డిగూడలోని ఆమె పుట్టింటి విషయంలో ఇంటి యజమానులు, అద్దెకుంటున్న వారి మధ్య కొంతకాలంగా వివాదం కొనసాగుతోంది. ఈ క్రమంలో బుధవారం బొంతు శ్రీదేవి తన తల్లి బాయమ్మతో కలిసి పుట్టింటికి వెళ్లి అద్దెకుంటున్న వారిపై దాడికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. 

ఈ ఘటనపై ఏషియన్ పీజీ హాస్టల్ యజమాని వీర హనుమాన్ రెడ్డి ఫిర్యాదు మేరకు బాయమ్మ, బొంతు శ్రీదేవిపై క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు పంజాగుట్ట ఇన్‌‌‌‌‌‌‌‌స్పెక్టర్ తెలిపారు.