జూలై 1 నుంచి CBSE పెండింగ్ ఎగ్జామ్స్

జూలై 1 నుంచి CBSE పెండింగ్ ఎగ్జామ్స్

క‌రోనా లాక్ డౌన్ కార‌ణంగా ఆగిపోయిన సీబీఎస్ఈ టెన్త్, 12వ త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లపై క్లారిటీ వ‌చ్చింది. ఆ ఎగ్జామ్స్ ను జూలై 1 నుంచి 15 వ‌ర‌కు నిర్వ‌హించేందుకు కేంద్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఈ విష‌యాన్ని కేంద్ర మాన‌వ వ‌న‌రుల అభివృద్ధి శాఖ మంత్రి ర‌మేశ్ పోఖ్రియాల్ ప్ర‌క‌టించారు. విద్యార్థులంతా బాగా ప్రిపేర్ అయ్యి ప‌రీక్ష‌లు రాయాల‌ని, ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఏయే రోజుల్లో ఏ ప‌రీక్ష‌లు జ‌రుగుతాయ‌న్న షెడ్యూల్ త్వ‌ర‌లోనే వెల్ల‌డిస్తామ‌న్నారు.

వాస్త‌వానికి సీబీఎస్ఈ 10, 12వ త‌ర‌గ‌తుల బోర్డ్ ఎగ్జామ్స్ ప్రతి ఏడాది మార్చి – ఏప్రిల్ నెల‌ల్లోనే జ‌రుగుతాయి. అయితే ఈ సంవ‌త్స‌రం క‌రోనా వైర‌స్ వ్యాప్తి కార‌ణంగా ప‌రీక్ష‌లు వాయిదా ప‌డ్డాయి.

More News:

సీబీఎస్ఈ ప‌రీక్ష‌లు పెట్ట‌బోయే ఆ 29 స‌బ్జెక్టుల లిస్ట్ ఇదే..

ఇంట‌ర్న‌ల్ మార్కుల ఆధారంగా CBSE విద్యార్థుల ప్ర‌మోష‌న్

టెన్త్ ప‌రీక్ష‌లు దేశ వ్యాప్తంగా పూర్తి కాగా.. సీఏఏ అల్ల‌ర్ల కార‌ణంగా ఈశాన్య ఢిల్లీలో కొన్ని స‌బ్జెక్ట్స్ ప‌రీక్ష‌లు ఆగిపోయాయి. వాటిని అన్నీ ఎగ్జామ్స్ పూర్త‌య్యాక పెట్టాల‌ని భావించింది సీబీఎస్ఈ బోర్డు. కానీ టెన్త్ ఎగ్జామ్స్ పూర్త‌య్యే స‌మ‌యానికి క‌రోనా వైర‌స్ వ్యాప్తి పెర‌గ‌డంతో కేంద్రం దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించింది. అదే స‌మ‌యంలో 12వ త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు దేశమంతా వాయిదా ప‌డ్డాయి.

దీంతో ఈ ఎగ్జామ్స్ నిర్వ‌హ‌ణ‌పై ఉత్కంఠ నెల‌కొంది. ఎట్ట‌కేల‌కు జూలై 1 నుంచి 15 వ‌ర‌కు ప‌రీక్ష‌లు జ‌రుగుతాయ‌ని శుక్ర‌వారం ప్ర‌క‌టించారు కేంద్ర మంత్రి ర‌మేశ్ పోఖ్రియాల్. అయితే అన్నీ ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించ‌డం ఇబ్బంది మారుతుంద‌ని యూనివ‌ర్సిటీ ప్ర‌వేశాల‌కు సంబంధించిన ముఖ్య‌మైన 29 స‌బ్జెక్టుల‌కు మాత్ర‌మే ఎగ్జామ్స్ పెడుతామ‌ని గ‌తంలోనే కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. వీటికి సంబంధించిన షెడ్యూల్ ను త్వ‌ర‌లోనే సీబీఎస్ఈ బోర్డు ప్ర‌క‌టించ‌నుంది.