వీసీ పోస్టుల్లో సగం బీసీలకివ్వాలి: జాజుల

వీసీ పోస్టుల్లో సగం బీసీలకివ్వాలి: జాజుల

హైదరాబాద్, వెలుగు :  యూనివర్సిటీ వైస్​ చాన్స్ లర్ల భర్తీల్లో సగం పోస్టులను బీసీలకు కేటాయించాలని సీఎం రేవంత్​ను బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్​ గౌడ్​ కోరారు. ఈ మేరకు ఆయన శనివారం సీఎం రేవంత్​కు లేఖ రాశారు. 

రాష్ట్రంలోని ప్రధాన వర్సిటీల్లో ఈ నెలాఖరుకు వీసీ పోస్టులు ఖాళీ అవుతున్నాయని, అందులో బీసీలకు కనీసం ఐదు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. వీసీల నియామకాల్లో సామాజిక న్యాయాన్ని పాటించాలని కోరారు. ఇప్పటికే వీసీల భర్తీకి సెర్చ్​కమిటీలను వేశారని, ఆ కమిటీల్లో బీసీలున్నా, లేకపోయినా పోస్టుల భర్తీలో మాత్రం బీసీలను పరిగణనలోకి తీసుకోవాలని రిక్వెస్ట్ చేశారు. అన్ని అర్హతలుండి ప్రతిభ ఉన్న బీసీలకు సముచిత ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొన్నారు.