మొయినాబాద్ డ్రగ్స్ కేసుపై ఈగల్ టీం కీలక ప్రకటన..

మొయినాబాద్ డ్రగ్స్ కేసుపై ఈగల్ టీం కీలక ప్రకటన..

మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసు ఇరు తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ పై దాడి చేసిన ఈగల్ టీం పోలీసులు 11 మందిని అదుపులోకి తీసుకోగా... వారిలో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ సహా ఆరుగురికి డ్రగ్స్ పాజిటివ్ వాచినట్లు తెలిపారు పోలీసులు. అయితే.. సోమవారం ( మార్చి 16 ) పార్లమెంటు సమావేశాలు ఉన్న క్రమంలో ఎంపీ పుట్టా మహేష్ కు స్టేషన్ బెయిల్ మంజూరు చేశారు పోలీసులు. ఈ క్రమంలో మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసుకు సంబంధించి కీలక ప్రకటన చేసింది ఈగల్ టీం.

డ్రగ్స్ పార్టీ సమాచారం మేరకు మొయినాబాద్ పోలీసులు, ఎస్ఓటీ పోలీసులతో కలిసి సంయుక్తంగా దాడులు నిర్వహించామని తెలిపింది ఈగల్ టీం. ఫామ్ హౌస్‌లో 11 మందిని అదుపులోకి తీసుకున్నామని... దాడి సమయంలో ఫామ్ హౌస్ నుంచి కాల్పుల శబ్దం వినిపించిందని తెలిపారు పోలీసులు. 

►ALSO READ | మొయినాబాద్ డ్రగ్స్ కేసులో ఎంపీ పుట్టా మహేష్ కు స్టేషన్ బెయిల్..

నిందితుల నుంచి జర్మనీ తయారీ .32 రివాల్వర్, కార్ట్రిడ్జ్‌లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. శరత్ కుమార్ దగ్గర 0.26 గ్రాముల కోకైన్ స్వాధీనం చేసుకున్నామని.. డ్రగ్స్‌ను కౌశిక్ రవి ద్వారా తెప్పించినట్లు నిర్దారణ అయినట్లు తెలిపారు పోలీసులు. 

ఈ కేసులో 11 మందికి డ్రగ్ టెస్ట్ నిర్వహించగా.. 5 మందికి పాజిటివ్ వచ్చిందని..భారీగా బీర్, విస్కీ, వోడ్కా బాటిళ్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు పోలీసులు. ఈ కేసుకి సంబంధించి దర్యాప్తు ముమ్మరం చేసినట్లు తెలిపారు పోలీసులు.