అపోలో హాస్పిటల్స్‌‌కు సీసీఐ గ్రీన్‌‌ సిగ్నల్‌‌

అపోలో హాస్పిటల్స్‌‌కు సీసీఐ గ్రీన్‌‌ సిగ్నల్‌‌

హైదరాబాద్‌‌, వెలుగు: ఫార్మా బిజినెస్‌‌లో వాటా డైవెస్ట్‌‌ చేయాలనే అపోలో హాస్పిటల్స్‌‌ లిమిటెడ్‌‌ ప్రతిపాదనకు కాంపిటీషన్‌‌ కమిషన్ ఆఫ్‌‌ ఇండియా (సీసీ) అనుమతి లభించింది. దీంతో ఫార్మా వ్యాపారాన్ని వేరు చేసి, తర్వాత ఆ వాటాలను వేరే ఇన్వెస్టర్లకు అమ్మాలనే అపోలో ఆలోచన ఇక కార్యరూపంలోకి రానుంది. రీస్ట్రక్చరింగ్‌‌లో భాగంగా అపోలో ఫార్మసీలో తన వాటాను ఏకమొత్తంగా రూ. 527.8 కోట్ల  నగదుకు విక్రయించాలని నవంబర్‌‌ 2018 లో అపోలో హాస్పిటల్స్‌‌ ఎంటర్‌‌ప్రైజస్‌‌ లిమిటెడ్‌‌ (ఏహెచ్‌‌ఈఎల్‌‌) ప్రతిపాదించింది. ఫలితంగా అపోలో ఫార్మసీ లిమిటెడ్‌‌ (ఏపీఎల్‌‌) మరో కంపెనీ అపోలో మెడికల్స్‌‌ ప్రైవేట్‌‌ లిమిటెడ్‌‌ (ఏఎంపీఎల్‌‌)కు సబ్సిడరీగా మారుతుంది.

ఏఎంపీఎల్‌‌లో ఏహెచ్‌‌ఈఎల్‌‌కు 25.5 శాతం వాటా ఉంటుంది. కొత్త ఇన్వెస్టర్లు ఈనం సెక్యూరిటీస్‌‌కు 44.7 శాతం, జీలం ఇన్వెస్ట్‌‌మెంట్‌‌ ఫండ్‌‌కు 19.9 శాతం, హేమేంద్ర కొఠారికి 9.9 శాతం వాటా ఏపీఎంఎల్‌‌లో ఉంటాయి. ఫలితంగా ఏపీఎల్‌‌కు దీర్ఘకాలిక ప్రాతిపదికన ఎక్స్‌‌క్లూజివ్‌‌ సప్లయర్‌‌గా ఏహెచ్‌‌ఈఎల్‌‌ మారుతుంది. అంతేకాకుండా, ఏపీఎల్‌‌తో అపోలో ఫార్మసీ బ్రాండ్‌‌ లైసెన్స్‌‌ ఇచ్చేందుకూ మరో అగ్రిమెంట్‌‌ను ఏహెచ్‌‌ఈఎల్‌‌ కుదుర్చుకుంటుంది. హెల్త్‌‌కేర్‌‌, ఫార్మసీ వ్యాపారాలు రెండింటి భవిష్యత్‌‌నూ దృష్టిలో పెట్టుకుని ఈ రీస్ట్రక్చరింగ్‌‌ ప్రతిపాదన తెచ్చినట్లు ఏహెచ్‌‌ఈఎల్‌‌ తెలిపింది.