మద్దతు ధరతో పత్తి కొంటం : రైతులకు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా భరోసా

మద్దతు ధరతో పత్తి కొంటం :  రైతులకు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా భరోసా

హైదరాబాద్, వెలుగు : పత్తి ధరలు బహిరంగ మార్కెట్ లో తగ్గితే మద్దతు ధరతో కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని కాటన్ కార్పొరేషన్  ఆఫ్ ఇండియా (సీసీఐ) వెల్లడించింది. ప్రస్తుతం ధరలు మద్దతు ధర కంటే ఎక్కువగానే ఉన్నాయని పేర్కొంటూ వ్యాపారులు ధరలు తగ్గిస్తే ఎంఎస్పీ ప్రకారం కొనుగోలు చేస్తామని సీసీఐ ప్రకటించింది. పత్తి రైతులను రక్షించడానికి ప్రస్తుత పత్తి సీజన్ లో మొత్తం 11 పత్తి పండించే రాష్ట్రాల్లో 400 కంటే ఎక్కువ పత్తి సేకరణ కేంద్రాలను ప్రారంభించామని సీసీఐ వెల్లడించింది.

ప్రస్తుతం పత్తి ధరలు ఎంఎస్పీ కన్నా ఎక్కువగా ఉన్నాయని, రైతులు మద్దతు ధర కన్నా తక్కువకు పత్తిని విక్రయించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. పత్తిని పండించే రాష్ట్రాల్లో మద్దతు ధరకు పత్తి కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చింది. జూన్ మొదటి వారంలో రుతుపవనాలు సమీపిస్తున్నందున వర్షాల వల్ల పత్తి నష్టాన్ని ఏ స్థాయిలోనైనా రక్షించడానికి, ప్రస్తుత పత్తి సీజన్ కోసం ఎంఎస్పీ కార్యకలాపాల కింద పత్తి సేకరణ విండో మే 20 వరకు వరకు తెరిచి ఉంటుందని తెలిపింది. దీనివల్ల రుతుపవనాల ప్రారంభానికి ముందే పత్తి ప్రాసెసింగ్ పూర్తవుతుందని సీసీఐ పేర్కొంది.