హరీశ్ రావు రాసిపెట్టుకో.. కొమురవెల్లి మల్లన్న సాక్షిగా పంద్రాగస్టు లోపు రుణమాఫీ : సీఎం రేవంత్ రెడ్డి

హరీశ్ రావు రాసిపెట్టుకో.. కొమురవెల్లి మల్లన్న సాక్షిగా పంద్రాగస్టు లోపు రుణమాఫీ : సీఎం రేవంత్ రెడ్డి

బీఆర్ఎస్ నేతలపై విమర్శలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. హరీశ్ రావు, కేసీఆర్ సిద్ధిపేటకు పట్టిన శని అని విమర్శించారు. సిద్దిపేటకు 45 ఏళ్ల నుంచి మామ అళ్లల్లు శనిలా పట్టారని అన్నారు. "హరీష్ రావు రాసిపెట్టుకో కొమురవెల్లి మల్లన్న సాక్షిగా పంద్రాగస్టు లోపల రెండు లక్షల రైతు రుణమాఫీ చేస్తా"  అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మెదక్ లో దొరల గడీలను బద్దలకొడతామని చెప్పారు.

 బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామి రెడ్డి కలెక్టర్ గా ఉండి అరాచకాలు చేశారని తెలిపారు. జనం జీవితాలతో చలగాటం ఆడారని ఆరోపించారు. సిద్ధిపేటలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ రోడ్ షోలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందిరా గాంధీని గెలిపించి ప్రధానిని చేసిన చరిత్ర మెదక్ గడ్డదని అన్నారు.  బీఆర్ఎస్ బీజేపీ రెండూ ఒక్కటేనని రాత్రి అయితే రెండు పార్టీలు ఒక్కటవుతాయని చెప్పారు.

 ప్రమాణ స్వీకారం రోజు ప్రగతీభవన్ కంచెలు తెంచామని తెలిపారు. బలహీన వర్గాలకు న్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. ప్రజా స్వామ్య రక్షణ కోసం కాంగ్రెస్ గెలవాలని   ఒక్కో కార్యకర్త వంద మందితో సమానామని  నీలం మదును భారీ మెజారిటీతో గెలిపించాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు.